ప్రపంచంలో అద్భుత వంటకాలు అందించే దేశాల్లో భారత్ స్థానం ఇదీ!
ఒక్కొక్క ప్రాంతానికిఉన్న ప్రత్యేకతను బట్టి.. ఆయాప్రాంతాల వంటకాలు వండివారుస్తారు.
చవులూరించే వంటకాలకు భారతదేశం పెట్టింది పేరని అందరూ అనుకుంటారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలురకాలైన వంటకాలకు మంచి పేరుంది. ఒక్కొక్క ప్రాంతానికిఉన్న ప్రత్యేకతను బట్టి.. ఆయాప్రాంతాల వంటకాలు వండివారుస్తారు. వీటిలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో వండే బిస్‌బిలే బాత్, ఏపీలో పులిహోర, పాయసం, తమిళనాడులో సాంబారు-ఇడ్లీ, కేరళలో కొబ్బరి వంటకాలు, పశ్చిమ బెంగాల్ రసగుల్లాలు, ఇలా.. ఒక్కొక్క ప్రాంతానికి ఉండే ప్రత్యేకత వాటి సొంతం. ఇతమిత్థంగా భారతీయ వంటకాలకు మంచి పేరే ఉంది.
కానీ, ఇది దేశానికే పరిమితమా? అంటే.. ఔననే తెలుస్తోంది.తాజాగా ప్రపంచ స్థాయిలో అద్భుత రీతిలో చవులూరించే వంటకా లతో `విందు-పసందు` అనే రీతిలో వండి వార్చే దేశాల్లో మనం 12వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇది నిజమా? అని ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమే. ప్రపంచ స్థాయిలో అద్భుతమైన వంటకాలు వండి వార్చే దేశాల వివరాలను ``ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్`` తాజాగా విడుదల చేసిన నివేదిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నివేదికలో భారత్‌కు 12వ చోటు దక్కింది.
ప్రపంచ స్థాయిలో నోరూరించే వంటకాలు చేసే దేశాలుగా గ్రీక్, ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ తదితర దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆయా దేశాల్లో వండి వార్చే పదార్థాలకు ప్రపంచ స్థాయి పర్యాటకుల నుంచి హై రేటింగ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. వెజ్, నాన్ వెజ్ రెండు విభాగాల్లోనూ ఈ దేశాలే ముందు నిలవడం గమనార్హం. ఇక, సంప్రదాయ వంటలకు పెట్టింది పేరైన.. భారత దేశం 12వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. సో.. భారతీయ వంటకాలు.. చవులూరించి నా... ప్రపంచ దేశాల స్థాయిలో తొలి పది స్థానాల్లో లేకపోవడం కొంత ఆలోచించాల్సిన విషయం.