చికెన్ ఎలా వండాలో AI అసిస్టెంట్ నేర్పిస్తుంది

ఆస‌క్తిక‌రంగా ఏఐ వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ సూచ‌న‌లు పాటిస్తూ వంట చేయ‌డం చాలా సులువుగా మారింద‌ని ప్ర‌జ‌లు విశ్లేషిస్తున్నారు.

Update: 2024-12-16 04:36 GMT

వంట‌ల కార్య‌క్ర‌మాల‌కు యూట్యూబ్ లో గొప్ప ఆద‌ర‌ణ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. పాక‌శాల యూట్యూబ్ చానెళ్ల‌కు గూగుల్ నుంచి బోలెడంత ఆదాయం వ‌స్తోంది. అయితే వంట నేర్చుకునేందుకు ఇక‌పై యూట్యూబ్ వీడియోలు చూడాల్సిన ప‌ని లేద‌ని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఏఐ వంట‌శాల యాప్ లు పుష్క‌లంగా ప్లేస్టోర్ లో అందుబాటులోకి వ‌స్తుండ‌డం.. న‌ల‌భీమ పాకం వండాల‌నుకునేవారికి అనుకూలంగా మార‌డంతో అది ట్రెండ్ గా మారింది.

ఆస‌క్తిక‌రంగా ఏఐ వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ సూచ‌న‌లు పాటిస్తూ వంట చేయ‌డం చాలా సులువుగా మారింద‌ని ప్ర‌జ‌లు విశ్లేషిస్తున్నారు. పైగా వంటింట్లో లేదా ఫ్రిజ్ లో అప్ప‌టికి అందుబాటులో ఉన్న దినుసులు కూర‌గాయ‌లు ఆకుకూర‌ల‌ను ఉప‌యోగించి వంట చేయ‌డ‌మెలాగో కూడా ఏఐ అసిస్టెంట్ సులువుగా నేర్పిస్తోంది. దీంతో యూట్యూబ్ లో పాక‌శాస్త్ర నిపుణులు చెప్పిన స‌రంజామా అంతా వెతుక్కుని తెచ్చుకునేలోగానే ఏఐ అసిస్టెంట్ యాప్ లు చెప్పేవి విని, అందుబాటులో ఉన్న‌వాటితో వండేయొచ్చ‌ని కూడా చెబుతున్నారు.

AI- రూపొందించిన ఆహారం, పానీయ వంటకాలను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం ఎలా? రుచి వాస‌న స‌రిగా ఉంటుందా? అనే అనుమానాలు అక్క‌ర్లేదు. పరిమిత పదార్ధాలతో ప్రత్యేకమైన వంటకాలను రూపొందించడంలో AI సామర్థ్యం ప్రత్యేకమైన ఆహారాలు లేదా పదార్ధాల కలయికలతో న‌చ్చిన వెరైటీల‌ను కోరుకునే వారిని ఏఐ విధానం ఆకర్షిస్తుంది. సాంప్రదాయ వంటకాలకు ఇది ఇన్నోవేటివ్ ఛాలెంజ్ గా మారింద‌ని కూడా చెబుతున్నారు.

ఏఐ వంట‌కాల సృజ‌నాత్మ‌క‌త‌ ప్రభావాన్ని పరిశీలించేవారు చెబుతున్న మాట‌.. ప్రామాణిక వంటకాల కోసం AI సూచ‌న‌లు.. సాంప్రదాయ వంటకాల కంటే భిన్న‌మైన‌వేమీ కాదు.. రెండూ ఒక‌టే .. కానీ ఏఐ ఇంకా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. రుచి, వాసనలో తేడా లేకుండా వంటకాలను ప్ర‌య‌త్నించ‌డంలో AI కి సాంప్రదాయ వంట నిపుణుల‌ విధానాలు ఒకే విధంగా ఉన్నాయి. పాక శాస్త్రంలో సృజనాత్మకత, రెసిపీ ఉత్పత్తిలో ఏఐపై న‌మ్మ‌కం అంత‌కంత‌కు పెరుగుతోందని చెబుతున్నారు.

చ‌క్కెర వాడ‌కుండా స్వీట్లు చేయ‌డ‌మెలా? ప‌రిమిత దినుసుల‌తోనే చికెన్ ని రుచిక‌రంగా వండ‌ట‌మెలా? ఇలా చాలా విష‌యాల‌ను ఏఐ అసిస్టెంట్ ని అడిగి తెలుసుకోవ‌చ్చు. రోటీ- దాల్, చ‌పాతీలతో ఏ కాంబినేష‌న్ కూర అయితే బావుంటుందో? అది కూడా ఇంట్లోని ఫ్రిజ్ లో అందుబాటులో ఉన్న‌వాటితో ఎలా చేయాలో స‌ల‌హాలు కూడా ఇస్తుంది ఏఐ అసిస్టెంట్. మొత్తానికి ఏఐ వంట‌శాల యాప్ లు ఇప్పుడు ట్రెండ్ గా మారడానికి కార‌ణం వండే విధానంలో ఫ్లెక్సిబిలిటీ. ఇక‌పై మై షెఫ్ ఏఐ, స్మార్ట్ రెసిపీ ఏఐ షెఫ్‌, ఏఐ షెఫ్ రెసిపీ జ‌న‌రేట‌ర్ వంటి యాప్ ల‌లో అసిస్టెన్సీని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

Tags:    

Similar News