హైదరాబాద్ బిర్యానీకి తగ్గని క్రేజ్.. ప్రపంచ ర్యాంక్ ఎంతో తెలుసా?

రుచికరమైన వంటలు వండాలనన్నా.. వాటిని లాగించాలన్నా భారతీయులకు తిరుగులేదు.

Update: 2024-12-13 08:28 GMT

రుచికరమైన వంటలు వండాలనన్నా.. వాటిని లాగించాలన్నా భారతీయులకు తిరుగులేదు. భారతీయ వంటకాలకు సైతం దశాబ్దాల చరిత్ర ఉంది. అంతేకాదు.. మన వంటకాలను రుచిచూడని దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు. టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్స్ సైతం ఇదే వెల్లడించాయి. అందులోనూ.. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజీ మామూలుగా లేదు.

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరైనా కుమ్మేస్తుంటారు. కానీ.. ఏ రాష్ట్రంతోపోల్చినా హైదరాబాద్ బిర్యానీని మించింది లేదు. అందుకే.. హైదరాబాద్ బిర్యానీకి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు టాప్ 100 వంటకాల జాబితాలో చేరింది.

ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భోజనప్రియులు ఎంతో ఇష్టంగా తిన్న 100 ఉత్తమ వంటకాలను టేస్ట్ అట్లాస్ వరల్డ్ ఫుడ్ అవార్డులను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ వంటకాలు టాప్‌లో నిలిచాయి. అందులోనూ బటర్ చికెన్, హైదరబాద్ బిర్యానీ, చికెన్ 65, కీమా 100 ఉత్తమ వంటకాలలో స్థానం పొందాయి. ముర్గ్ మఖానీ అకా బటర్ చికెన్ 29వ ర్యాంక్, హైదరాబాదీ బిర్యానీ 31వ ర్యాంక్, చికెన్ 65 97వ ర్యాంక్, కీమా 100వ ర్యాంక్‌లు సాధించాయి.

చికెన్ అకా ముర్గ్ మఖానీ వంటకాన్ని హైదరాబాదీలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. బటర్ చికెన్, హైదరాబాద్ బిర్యానీ రెండూ కూడా ప్రపంచవ్యాప్తంగా 5 స్టార్లలో 4.52 రేటింగ్ సాధించాయి. చికెన్ 65, కీమా ఒక్కొక్కటి 4.44 రేటింగ్ పొందారు. అలాగే.. ఫుడ్ గైడ్ అమృతసరి కుల్చా, బటర్ గార్లిక్ నాన్ వంటి భారతీయ వంటకాలను కూడా అవార్డులలో ప్రస్తావించారు. ముఖ్యంగా టాప్ 10లో మిగితా తొమ్మిది స్థానాల్లో పలు వంటకాలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన నియాపోలిటన్ పిజ్జా, పికాన్హా (బ్రెజిల్), రెచ్టా (అల్జీరియా), ఫనాంగ్ కర్రీ (థాయిలాండ్), అసడోకబాబ్(అర్జంటేనీ), కోకర్ట్‌మే(టర్కీ), రావోన్(ఇండోనేషియా), కాగ్ కబాబ్ (టర్కీ), టిబ్స్ (ఇథియోపియా) తరువాతి స్థానాల్లో నిలిచాయి.

Tags:    

Similar News