తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద.. మహిళా రిజర్వేషన్ కోసం.. ఆమె తలపెట్టిన దీక్షకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు తెలిపారు. వాస్తవానికి దీనికి సంబంధించి నాలుగు రోజుల కిందటే ఆమె అనుమతి కోరడం.. పోలీసులు కూడా ఇవ్వడం అన్నీ జరిగాయి.
అయితే..అనూహ్యంగా ఢిల్లీ పోలీసులు ఈ అనుమతులను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో కవిత ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తమ దీక్షలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. అనుమతి రద్దుపై ఢిల్లీ పోలీసులతో మాట్లాడతామని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. మహిళా రిజర్వేషన్ కోసం.. తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలో శుక్రవారం దీక్ష తలపెట్టిన విషయం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. ఇప్పటికే జంతర్‌మంతర్ వద్ద దీక్షకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆయా ఏర్పాట్లను పరిశీలించేందుకు రెండు రోజుల ముందుగానే.. కవిత ఢిల్లీ చేరుకున్నారు.
అయితే.. ఏర్పాట్లు సమీక్షించి.. మీడియాతో మాట్లాడుతుండగా కవితకు ఢిల్లీ పోలీసుల నుంచి సమాచా రం అందింది. సాంకేతిక కారణాలతో దీక్షకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.దీనిపై కవిత భగ్గు మన్నారు. దీక్ష నిర్వహించుకునేందురు ముందుగా అనుమతిచ్చి.. తర్వాత ఎలా నిరాకరిస్తార ని మండిపడ్డారు. 5 వేల మంది ధర్నాకు హాజరవుతారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
వాస్తవానికి ఢిల్లీలో కేసీఆర్ మిత్రుడు కేజ్రీవాల్ ప్రభుత్వమే ఉంది. అయినప్పటికీ.. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలే చలామణి అవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు, శాంతి భద్రతల అంశం.. గవర్నరే చూసుకుంటున్నారు. పైగా.. కేజ్రీవాల్కు ఆయనకు క్షణం కూడా పడడం లేదు. ఈ నేపథ్యంలోనే కవితకు చుక్కెదురైందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.