ఆ స‌ర్వేలో మ‌న ఢిల్లీకి ప‌రువుపోయే ర్యాంక్ ద‌క్కింది

Update: 2017-10-16 08:39 GMT
మ‌హిళ రోడ్డెక్కితే చాలు....మ‌నుషుల రూపంలోని మృగాలు కాటు వేస్తున్నాయ‌ని...ఆడ‌వారిపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయ‌ని ఇటీవ‌లి కాలంలో మ‌న దేశంలోని కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది మ‌నుషుల్లోని రాక్ష‌స‌త్వానికి ప‌రాకాష్ట‌ అని పేర్కొంటూ తాము క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని గ‌ల్లీ నుంచి మొద‌లు ఢిల్లీ పాల‌కుల వ‌ర‌కు చెప్తూనే ఉన్నారు. అయితే అలాంటి ర‌క్ష‌ణ సాక్షాత్తు దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే క‌రువైంద‌ని తేలింది. బ‌ల‌మైన దేశంగా ఎదుగుతున్న భార‌త రాజ‌ధానిలో అబ‌లకు భ‌ద్ర‌త లేద‌ని తేలింది. మహిళలపై లైంగిక వేధింపుల‌కు  సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచంలో ఢిల్లీనే మొదటి నగరంగా నిలిచింది. త‌ద్వారా భార‌త్‌ లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు అనే భావ‌న‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లిగించింది. ఢిల్లీ త‌ర్వాతి స్థానంలో బ్రెజిల్‌ కు చెందిన సావ్‌ పౌలో నగరం ఉంది.

ప్రపంచంలోని మొత్తం 19 మహానగరాల్లో లండన్‌ కు చెందిన థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ `ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రాలు...మహిళల భద్రత` అనే అంశంపై స‌ర్వే నిర్వ‌హించింది. ఈ ఏడాది 2017 జూన్‌-జూలై నెలల మధ్య సర్వే నిర్వహించగా ఇందులో భార‌త్ ప‌రువుపోయే వాస్త‌వం తెర‌మీద‌కు వ‌చ్చింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో మహిళలు నిత్యం లైంగిక వేధింపులు - లైంగిక దాడులు - చిత్రహింసలు వంటి భయాలతో వణికిపోతుంటారని థామ్స‌న్ రాయిట‌ర్స్ స‌ర్వే తెలిపింది. అంతేకాకుండా భార‌త‌దేశంలోని మిగ‌తా న‌గ‌రాల కంటే ఎక్కువ‌గా ఢిల్లీలోనే ఈ లైంగిక దాడులు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని త‌ద్వారా లైంగిక దాడుల కేంద్రంగా ఢిల్లీ మారిపోయింద‌ని విశ్లేషించింది. ఈ సంద‌ర్భంగా మ‌రో కీల‌క‌మైన అంశాన్ని కూడా వెల్ల‌డించింది. ప్ర‌పంచం మొత్తం అవాక్క‌యిన నిర్భయ ఘటనను ఉద‌హ‌రిస్తూ ఈ ఆకృత్యం జ‌రిగి ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఏమాత్రం మెరుగవకుండా మరింత దిగజారింద‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News