ఈసారి 50 కార్లు ఢీకొట్టాయి

Update: 2016-01-25 07:15 GMT
దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు ఇబ్బందిపెడుతోంది. ఉదయం 11 గంటలు దాటినా కూడా ఎదురుగా ఏమీ కనిపించని పరిస్థితి ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహన ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. దేశంలోని హైస్పీడు రహదారుల్లో ఒకటైన యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై నిన్న 20 కార్లు ఒకేసారి ఢీకొన్న సంగతి మర్చిపోకముందే సోమవారం ఉదయం అంతకుమించిన ప్రమాదం జరిగింది. ఏకంగా 50 కార్లు వరుసగా ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు వాహనాల వేగం నియంత్రణలో ఉండడంతో ప్రాణ నష్టం తక్కువగానే ఉంది. 50 కార్లు ఢీకొనగా ఒక మహిళ మృతిచెందింది. 26 మంది గాయపడ్డారు.

పొగమంచు తీవ్రంగా ఉండడంతో పది మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి. అయితే... ప్రజలు వివిధ పనుల నిమిత్తం బయటకు రాక తప్పదు. దీంతో రోడ్లపై వాహనాలు లైట్లు వేసుకుని తిప్పలు పడుతూ తిరుగుతున్నాయి. అయినా కూడా అంచనాలు తప్పి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా అలాగే యమునా హైవేపై ఎదురుగా వెళ్తున్న ట్రక్ ను గుర్తించి లేకపోయిన ఓ కారు డ్రైవర్ దాన్ని

ఢీకొనడం ఆ వెంటనే వరుసగా కార్లనీ తమ ముందున్న కార్లను ఢీకొన్నాయి. ఇలా మొత్తం 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి.
Tags:    

Similar News