ఆ కాంబో...వైసీపీ మీద నమ్మకం తగ్గిస్తోందా ?
ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా తాను ఆయనకు మద్దతుగా నిలుస్తాను అని ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పేస్తారు.
మాటకు వస్తే చాలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ ఆయన పొగడ్తలలో రాష్ట్ర ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర బాగుండాలి అంటే బాబు నాయకత్వం అవసరం అని పవన్ పదే పదే చెబుతూ ఉంటారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా తాను ఆయనకు మద్దతుగా నిలుస్తాను అని ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పేస్తారు.
ఏపీలో పవన్ చంద్రబాబు కాంబోని డెడ్లీ గానే అంతా చూస్తారు. ఈ ఇద్దరూ కలిసారు అంటే వార్ వన్ సైడే అని చెప్పేస్తారు. దానికి కారణం టీడీపీకి ఉన్న సామాజిక ప్రాంతీయ బలాలు జనసేనకు ఉన్న సామాజిక ప్రాంతీయ బలాలు కలిస్తే ఏకంగా యాభై శాతానికి పైగా ఓటింగ్ డెడ్ ఈజీగా ఆ వైపు టర్న్ అవుతుంది అన్నది ఉంది.
ఈ ఇద్దరూ విడిపోతేనే తప్ప వైసీపీ అన్న మూడో పార్టీకి ఏపీలో చాన్స్ ఉండదు. 2019లో వైసీపీ 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టినా కూడా గోదావరి ఉత్తరాంధ్ర సహా కోస్తాలోని 101 సీట్లలో జనసేన టీడీపీకి వచ్చిన ఓట్లు కలిస్తే అత్యధిక సీట్లలో వైసీపీ వెనక్కి పోయింది.
అంటే ఈ రెండు పార్టీల ఓట్లు చీలితేనే తప్ప వైసీపీకి చాన్స్ రాదు అన్నది రాజకీయ గణితం సాక్షిగా నిరూపితం అయింది. ఇక జగన్ సీఎం కావాలి అని ఒక్కసారి అయినా ఆయనను ఆ సీట్లో చూడాలని ఎంతో ఆశపడిన వైసీపీ క్యాడర్ జనాలు అందరి కోరిక అంత ఉన్న 2019లోనే వైసీపీ ప్రభంజం టీడీపీ జనసేన రెండింటికీ కలిపి వచ్చిన ఓట్లను దాటి ముందుకు వెళ్ళలేకపోయింది.
మరి ఒకసారి సీఎం గా చేసి చూసేసిన పాలన మీద కొన్ని వర్గాల వ్యతిరేకత మీద రేపటి ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ జనంలోకి వెళ్తే ఈ డెడ్లీ కాంబోని దాటి విజయం సాధించడం అంటే కష్టమేనా అన్న చర్చ ఉంది. పైగా ఉత్తరాంధ్ర గోదావరి సహా కోస్తా జిల్లాలను 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి స్వీప్ చేసి పారేసింది.
ఇలాంటి నేపధ్యంలో వైసీపీలో ఉంటే గెలుపు బాట పట్టలేమని ఆలోచిస్తున్న నేతలే ఎక్కువగా ఉన్నారు. వారిలో కోస్తా జిల్లాల వారే కనిపిస్తారు. అందుకే రాజకీయంగా పండిన వీరతా ఒకసారి కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రెండవసారి రాదని యాంటీ ఇంకెంబెన్సీ ముంచెత్తి వైసీపీకి విజయ బాటలు వేస్తుంది అని జగన్ చెప్పిన దానిని అంగీకరించడం లేదని అంటున్నారు.
ఇలా వైసీపీ మీద ఉన్న అపనమ్మకం కూటమి పటిష్టంగా ఉంటుందని ఎలాంటి బీటలు రానేరావని తెలుస్తున్న నగ్న సత్యం ఇవన్నీ తెలిసే ఫ్యాన్ పార్టీ నుంచి బయటకు నేతలు వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు. ఇక చంద్రబాబు పవన్ తోనే అన్నట్లుగా కనిపిస్తున్నారు. పవన్ కూడా బాబుని వీడి పోయేది లేదని తేల్చి చెబుతున్నారు. దాంతో ఈ ఇద్దరు ఎంతకాలం కలసి ఉంటే అంతకాలం వైసీపీకి అధికారం కల్లే అన్నది చూసే ఇలా వైసీపీ నుంచి నేతలు బయటకు వస్తున్నారు అని అంటున్నారు.