మోడీ ప్రభుత్వంలో డాలర్ టు రూపాయి 62-87!
కానీ భారతదేశ ఆర్థిక విధానాలు, దిగుమతుల పెరుగుదల, చమురు ధరలు, మరియు అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల కారణంగా రూపాయి విలువ తగ్గింది.
భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, భారతీయ రూపాయి (INR) మారకపు రేటు అనేక ఆర్థిక, భౌగోళిక , రాజకీయ సంఘటనల ద్వారా ప్రభావితం చేయబడింది. స్వాతంత్ర్యం తర్వాత, 1 USD = ₹4.76గా ఉంది. కానీ ఆ తర్వాత కాలక్రమేణా మారకపు విలువలో మార్పులు వచ్చాయి.భారతదేశం 1950లో గణతంత్రంగా అవతరించింది, మరియు 1952లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో 1 USD = ₹4.76గా ఉంది. కానీ భారతదేశ ఆర్థిక విధానాలు, దిగుమతుల పెరుగుదల, చమురు ధరలు, మరియు అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల కారణంగా రూపాయి విలువ తగ్గింది.
-రూపాయి విలువ ఇలా పెరిగింది
* 1970 దశకం: డాలర్ మారకం రేటు దాదాపు ₹7కి పెరిగింది.
*1980 దశకం: ఇది ₹17కి చేరుకుంది.
* 1991 ఆర్థిక సంస్కరణలు: లిబరలైజేషన్ తర్వాత, 1991లో 1 USD = ₹17.90కి పెరిగింది.
* 2000 నాటికి: రూపాయి విలువ దాదాపు ₹44కి చేరింది.
* 2014 కాంగ్రెస్ యూపీఏ హయాం అంతానికి డాలర్ తో రూపాయి విలువ ₹62 గా ఉంది.
2001లో 1 USD = ₹47గా ఉండగా, ఇరవై సంవత్సరాల కాలంలో, భారత ఆర్థిక వృద్ధి వల్ల దిగుమతులకు డిమాండ్ పెరిగింది, ఇది కరెంట్ ఖాతా లోటును పెంచింది. దీనివల్ల రూపాయి మారకపు విలువ దశల వారీగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యమైన సంఘటనలు: 2008 ఆర్థిక మాంద్యం వల్ల రూపాయి మారకపు విలువపై ప్రతికూల ప్రభావం చూపింది. 2013 లోటస్ టేపర్ టాంట్రం వల్ల రూపాయి భారీ ఒత్తిడిని ఎదుర్కొంది, మారకం రేటు ₹68కి చేరింది.
2014 మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో 1 USD విలువ ₹62 ఉండగా 2023 నాటికి ₹83కి దారుణంగా పెరిగింది. ఈరోజుకు మోడీ హయాంలో మరింతగా రూపాయి విలువ పడిపోయి నేటికి 1 డాలర్ కు రూ.86.84 కు పడిపోయింది. ఇంతటి భారీ రూపాయి పతనం మోడీ ప్రభుత్వంలోనే జరగడం ఆ ప్రభుత్వం ఆర్థిక విధానాల వైఫల్యంగా నిపుణులు చెబుతున్నారు. 2020-2025 కాలంలో కోవిడ్-19, చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక అస్థిరత, విదేశీ పెట్టుబడుల వెనకడుగు వంటి కారణాలతో రూపాయి మరింత క్షీణించింది.
- రూపాయి పతనం వల్ల ప్రభావాలు
* దిగుమతులపై ప్రభావం : చమురు, గోల్డ్, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయి. దేశీయ వినియోగదారులకు ధరల భారంగా మారుతుంది.
* ద్రవ్యోల్బణం పెరుగుదల : ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజల ఖర్చు పెరుగుతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది.
* ఎగుమతిదారులకు లాభం : ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ కంపెనీలకు లాభకరం కావచ్చు. కానీ, దిగుమతులపై ఆధారపడే వ్యాపారాలకు నష్టమే.
- మోడీ ప్రభుత్వంలో రూపాయి మరింత పతనం.. దీనికి ప్రధాన కారణాలు:
మోడీ ప్రభుత్వ దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాల వల్ల రూపాయి మరింతగా పతనం అవుతోంది. ఎగుమతులు , దిగుమతుల మధ్య వ్యత్యాసంతో ఈ పతనం కొనసాగుతోంది. భారతీయ ఆర్థికత వృద్ధి రేటు మందగించడం.. చమురు ధరల పెరుగుదల , కేంద్ర బ్యాంక్ యొక్క పాలసీలు ఈ రూపాయి పతనానికి దారితీస్తున్నారు. దీన్ని నివారించడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలం అవుతోంది.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 1 USD = ₹62గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయిని డాలర్ తో పడిపోకుండా మంచి ఆర్థిక విధానాలే అనుసరించింది. కానీ మోడీ సర్కార్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో 2025 నాటికి డాలర్ తోరూపాయి ₹87కి చేరింది. ఇది యూపీఏ హయాంలో కంటే భారీ క్షీణతగా చెప్పవచ్చు. రూపాయి విలువను నిలబెట్టడంలో మోడీ ప్రభుత్వం పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని విమర్శలు ఉన్నాయి.
భారతీయ రూపాయి మారకం విలువ అనేక అంతర్జాతీయ , దేశీయ అంశాల ప్రభావానికి లోనవుతోంది. దీని విలువను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వ విధానాలు, వాణిజ్య ధోరణులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తాయి. మోడీ హయాంలో రూపాయి భారీగా క్షీణించినప్పటికీ, దీని వెనుక ఉన్న గణాంకాలను అంతర్జాతీయ ప్రభావాలను పరిశీలించడం అవసరం. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం తీసుకునే ఆర్థిక చర్యలు రూపాయి భవిష్యత్ మార్గాన్ని నిర్ణయించనున్నాయి.
రూపాయి పతనం నియంత్రించడానికి దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణలు, వాణిజ్య వ్యూహాలు అవసరం. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో మెరుగైన ఆర్థిక విధానాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.