బీజేపీకి చీరాల జనాలు షాకిచ్చారా ?

Update: 2023-06-21 12:00 GMT
బీజేపీకి చీరాల జనాలు ఊహించని షాకిచ్చారు. రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చీరాలలో బీజేపీ సభ నిర్వహించింది. సభలో పాల్గొనేందుకు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో పాటు సీనియర్ నేతలంతా హాజరయ్యారు. అయితే వీళ్ళు ఊహించని విధంగా జనాలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. చుట్టపక్కల ప్రాంతాల నుండి సభాప్రాంగణానికి వచ్చిన జనాలంతా వీర్రాజును తన ప్రశ్నలతో  ఉతికి ఆరేశారనే చెప్పాలి. విభజనచట్టంలో ఏపీకి ఇస్తానని చెప్పిన ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏమైంది ? కడప ఉక్కుపరిశ్రమ మాటేమైంది ? అంటు నానా గోలచేశారు.

ప్రజల నుండి ఇలాంటి వ్యతిరేకత వస్తుందని బీజేపీ నేతలు ఏమాత్రం ఊహించుండరు. ఎందుకంటే ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు అంశాలు మరగున పడిపోయాయని కమలనాదులు అనుకుంటున్నారు.

వీటితో పాటు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరిస్తోందంటు నిలదీశారు. జనాలు అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి వీర్రాజుతో పాటు మిగిలిన నేతలు సమాధానం చెప్పలేకపోయారు. అసలు జనాల ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలో కూడా వీళ్ళకి అర్ధంకాలేదు.

విభజన చట్టంపై పార్టీలన్నీ మౌనంపాటిస్తున్నాయి కాదా ఏదోలా మ్యానేజ్ చేశాము కదాని బీజేపీ నేతలు అనుకునుండచ్చు.  కానీ జనాల్లో విభజన చట్టం హామీల అమలు అన్నది ఇంకా గుర్తుందని కమలనాదులు ఊహించినట్లు లేరు. పార్టీలదేముంది అవసరానికి తగ్గట్లుగా మాటలు మారుస్తాయి. కానీ జనాలు అలాకాదుకదా అన్నింటినీ గుర్తుంచుకుంటారు.

అసలు బీజేపీకి రాష్ట్రంలో ఎందుకు ఆదరణ లేదన్నవిషయం బహుశా చీరాల జనాల స్పందన, నిలదీతలతో అర్ధమైయుంటుందా ? ఎందుకంటే ప్రతిపార్టీ జనాలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి విభజనచట్టాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందే కాకుండా ఎన్ని అబద్ధాలు చెప్పిందో అందరు చూశారు.

దీనికి అదనంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధించలేక బహిరంగంగా తప్పుపట్టలేక బీజేపీ నేతలు కూడా చాలా డ్రామాలనే ఆడారు. వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు లాంటి నేతలు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ముందుముందు చీరాలలో జరిగిన ప్రతిఘటనల్లాంటివే మరిన్ని ఎదురైనా ఆశ్చర్యంలేదు.

Similar News