డిసాస్టర్ గర్ల్.. అర మిలియన్ డాలర్లు సంపాదించింది

Update: 2021-04-28 05:30 GMT
అగ్నికి ఆహుతి అవుతున్న ఓ ఇంటి ఎదుట చిన్నారి అలా నవ్వుతూ కనిపిస్తున్న ఫొటో ఇప్పుడు కాసులు కురిపించింది. సాధారణంగా ఇల్లు కాలిపోయినప్పుడు ఏ మనిషి ఫీలింగ్ అయినా ఎలా ఉంటుంది. ‘వామ్మో వాయ్యో నా వస్తువులు, నా టీపీ, నా ల్యాప్ టాప్ సహా ఇంట్లోని డబ్బు,నగలును తలుచుకొని గుండెలు బాదుకుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం తన ఇల్లు కాలుతున్నా అంత స్వచ్ఛంగా ఆ ఇంటి ముందు నవ్వుతున్న ఫొటో బెస్ట్ ఫొటోగా ఎంపికైంది.

ఒక ఇల్లు కాలిపోతుండగా ఆమె ముందు నవ్వుతున్న ఒక చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఇదో పాపులర్  మీమ్స్ లో ఒకటి. ఇప్పుడు ఆ చిన్నారి యువతి గా మారింది. ఆమె పేరు జో రోత్. ఆ ఫోటోకు ఏకంగా  430000 డాలర్లు సంపాదించి పెట్టింది. .

2005 జనవరిలో ఆమె తండ్రి ఈ ఫొటో తీసినప్పుడు జో రోత్‌కు నాలుగేళ్ల వయసు. తాజాగా జెపిజి మ్యాగజైన్ ‘ఎమోషన్ క్యాప్చర్’ పోటీలో ఈ ఫొటో ఎంపికైంది. చాలా మందికి ఇష్టమైన జ్ఞాపకంగా మారింది. రోత్ వయూసు ఇప్పుడు 21 ఏళ్లు. ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయంలో ఆమె చదువుతోంది. ఈ ఫొటో ఉత్తమ చిత్రంగా ఎంపికై 430,000 డాలర్ల ప్రైజ్ మనీ సంపాదించింది.

జో మరియు ఆమె తండ్రి ఏప్రిల్ 16న ఈ పోటీలో ‘డిజాస్టర్ గర్ల్’ విభాగంలో ఈ ఫొటోను నామినేట్ చేశారు. ఇది తక్కువకు అమ్ముడవుతుందని ఆమె ఊహించింది, కానీ దాని విలువ 430,000 డాలర్లు పలకడం ఆ తండ్రీ బిడ్డలను ఆశ్చర్యపరిచింది.
Tags:    

Similar News