టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పర్యటన కేంద్రంగా నెలకొంటున్న వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది. రాజధానిలోని నిర్మాణాలను పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్లగా... గో బ్యాక్ చంద్రబాబు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు చెప్పులతో దాడికి దిగారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు ఎంట్రీ ఇవ్వడంతో ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో బాబు టూర్‌ను హైప్ చేసేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగించడం చర్చనీయాంశంగా మారింది. వీఐపీ జోన్‌లో అనుమతులు లేకుండా డ్రోన్లు ఉపయోగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చంద్రబాబు అమరావతి పర్యటనలో టీడీపీ డ్రోన్లను వినియోగించడాన్ని నిరసిస్తూ వైసీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తుళ్లూరు డీఎస్పీకి ఫిర్యాదు అందజేశారు.
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటనలో రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా తమతమ వాదనలు వినిపించారు. అయితే, అమరావతి పర్యటనలో తమకు దక్కిన ఆదరణ గురించి చాటిచెప్పేందుకు టీడీపీ నేతలు డ్రోన్లతో ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు డ్రోన్ కెమెరాలు వినియోగించి ఫొటోలు, వీడియోలు షూట్ చేశారు. ఈ మేరకు డ్రోన్లతో షూట్ చేసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, దీనిపై వైసీపీ మండిపడింది. హై సెక్యూరిటీ జోన్ లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా టీడీపీ డ్రోన్ వాడిందని పేర్కొంటూ వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్న ప్రాంతంలో డ్రోన్ వినియోగించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొంటూ ఆయన పోలీసులను కోరారు. సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించారని.. మాజీ మంత్రి నారా లోకేష్ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని ఆయన మండిపడ్డారు.
వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై తుళ్లూరు పోలీసులు స్పందించారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా డ్రోన్లు వినియోగించినట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న ప్రాంతంలో అనుమతులు లేకుండా డ్రోన్లు వినియోగించకూడదని నిబందనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.