రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారతదేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనను స్టాక్ మార్కెట్లు హర్షించలేదు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నప్పటి నుంచి స్టాక్ మార్కెట్లలో మందగమనం కనిపించింది. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల బారిన పడ్డాయి. అయితే దీనికి ఇతర అంశాలు కూడా జత కలవడంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి.
అమెరికా అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని వ్యాపారాలు ఆందోళన చెందారు. మొదటి నుంచి స్టాక్స్ మార్కెట్ ప్రారంభంలోనే 387 పాయింట్లు నష్టపోయాయి. అనంతరం కొంత సెన్సెక్స్ ఊగిసలాడింది. నిఫ్టీ కూడా 123 పాయింట్లు నష్టపోయింది. అయితే చివర వరకు ఇదే కొనసాగింది. సాయంత్రం ఇదే కొనసాగి నష్టాల బారిన పడింది. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. అయితే దీనికి కారణం ట్రంప్ పర్యటనతో పాటు కరొనా వైరస్ ప్రభావం - అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులతో స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు ఏర్పడ్డాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.