తాము కోరినట్లు పని చేయ లేదని రెవెన్యూ అధికారిణి ని పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం సంచలనంగా మారటమే కాదు.. కొత్త బెదిరింపుల కు తెర తీస్తోంది. ప్రభుత్వ ఆఫీసు ల్లో అధికారుల నోటి వ్యతిరేక వ్యాఖ్యలు వస్తే చాలు.. పెట్రోల్ పోసి చంపేస్తామన్న మాట తరచూ వస్తోంది. తాజాగా అలాంటి వ్యాఖ్యే అనంతపురం జిల్లా లో వచ్చింది. అయితే.. ఈ వార్నింగ్ ఇచ్చిన వారు వృద్ధులు కావటం విశేషం.
అనంతపురం జిల్లా లోని కూడేరులోని ఎంపీడీవో ఆఫీసు కు పలువురు వృద్ధులు వెళ్లారు. ఈ నెల ఫించన్ ఎందుకు ఇవ్వ లేదని ప్రశ్నించారు. ఫించన్ ఈ నెల రాలేదని.. వచ్చే నెల లో ఇస్తామంటూ ఎంపీడీవో బదులిచ్చాడు. వారి మధ్య మాటలు పెరిగిన వేళ.. ఆగ్రహం తో ఊగి పోయిన వృద్ధులు తమకు కానీ వచ్చే నెలలో ఫించను రాకుంటే.. పెట్రోల్ పోసి తగల బెడతామని పంచాయతీ కార్యదర్శి మురళీ కృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వైనం సంచలనంగా మారింది.
దీంతో బెదిరిన అధికారులు పోలీసు అధికారుల కు సమాచారాన్ని ఇచ్చారు. రంగప్రవేశం చేసిన పోలీసులు పంచాయితీ కార్యదర్శి కి వార్నింగ్ ఇచ్చిన పెన్నో బులేశు.. శివమ్మ తో పాటు మరో వ్యక్తి ని అదుపు లోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో శివమ్మ చేతిలో కొడవలి ఉండటం తో అధికారులు వణికారు. అయితే.. ఇక్కడ గమనించాల్సిన అంశం.. బెదిరింపులకు పాల్పడింది వృద్ధులు. మామూలు వారైతే.. బెదిరింపులకు పాల్పడ్డారని అనుకోవచ్చు. వృద్ధులు అయి ఉండి ఇలా బెదిరించారా? ఇందులో వారి తప్పు ఎంత? అధికారుల తప్పు ఎంత? అన్న విషయం పై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.