హైదరాబాద్ లో పరుగులు పెట్టేందుకు మెట్రో రైలు సిద్ధం అయ్యింది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్లు ఇప్పటికే ట్రయల్ రన్ నడుస్తోంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ - మంత్రి కేటీఆర్ - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ - మెట్రో రైలు అధికారులు ఇవాళ మెట్రోరైలులో ప్రయాణించారు. ఎస్సార్ నగర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించి రైలుని - మెట్రో రైల్వేస్టేషన్లను పరిశీలించారు. మియాపూర్ లో మెట్రో రైలు డిపోను సందర్శించారు. అధికారులను అడిగి భద్రత - ఇతర పనుల వివరాలు తెలుసుకున్నారు.
ఈ జర్నీలో చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ - మున్సిపల్ సెక్రటరీ నవిన్ మిట్టల్ కూడా ఉన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ డీవీఎస్ రాజు సోమవారం రోజున మెట్రో పనులను సమీక్షించారు. బేగంపేట - ఎస్ ఆర్ నగర్ మధ్య ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ పనులను ఆయన ఆరా తీశారు. అమీర్ పేట వద్ద ఓఈటీఎస్ పనులకు ఆయన ఆమోదం కూడా తెలిపారు. ఇవాళ బేగంపేట నుంచి అమీర్ పేట మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 28న హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి సమయం ఇస్తే ఆయన చేతుల మీదుగా మెట్రోరైలుని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో, ఇప్పటికే నాగోల్-మియాపూర్ లైన్ సిద్ధం చేశారు.
కాగా, ఈ నెల 15 నాటికి మెట్రో రైల్ ప్రారంభానికి రెడీ అవుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 28న మెట్రోరైల్ ను ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరామన్నారు. ప్రపంచ భాగస్వామ సదస్సు ప్రారంభానికి ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైల్ ప్రారంభంపై ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.
నాగోల్ నుంచి అమీర్ పేట వరకు 7 స్టేషన్ల నిర్మాణం 2015 ఉగాది నాటికే పూర్తైంది. నాగోల్ - ఉప్పల్ - సర్వే ఆఫ్ ఇండియా - ఎన్జీఆర్ ఐ - హబ్సిగూడ - తార్నాక - మెట్టుగూడ స్టేషన్లు రెడీ అయ్యాయి. ఆ తర్వాత సికిందాబ్రాద్ రైల్వే స్టేషన్ - ప్యాట్నీ స్టేషన్ - ప్యారడైజ్ - రసూల్ పుర చౌరస్తా - బేగంపేట షాపర్స్ సాప్ట్ - బేగంపేట రైల్వే స్టేషన్ - అమీర్ పేట ఇంటర్ చేంజ్ స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఈ స్టేషన్లలో అవసరాలకు తగినట్టుగా పార్కింగ్ ప్లేసులు లేవనే అభిప్రాయం ఉంది. కారిడార్ -1 లో అమీర్ పేట నుంచి మియాపూర్ వరకు 11 మెట్రో స్టేషన్లు ఉండగా - మియాపూర్ - జేఎన్టీయూ - కేపీహెచ్ బీ కాలనీ - కూకట్ పల్లి - బాలానగర్ - మూసాపేట - భరత్ నగర్ - ఎర్రగడ్డ - ఈఎస్ ఐ ఆస్పత్రి - ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ల నిర్మాణం 8 నెలల కిందే పూర్తైంది. వీటిలో మియాపూర్ - భరత్ నగర్ స్టేషన్లు మినహా మిగతా స్టేషన్లల్లో పార్కింగ్ సౌకర్యాలు సరిగా లేవనే భావన ఉంది. నిర్మాణంలో ఉన్న అమీర్ పేటలో ఇంటర్ చేంజ్ స్టేషన్ దగ్గర పార్కింగ్ కోసం స్థలం ఉంది. దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే మెట్రో రైలు ప్రారంభమైతే పార్కింగ్ ఇబ్బందులు రాకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు 72 కి.మీ మెట్రో రూట్లో మూడు కారిడార్లలో మొత్తం 32 పార్కింగ్ కాంప్లెక్స్ లను అభివృద్ధి చేస్తున్నారు. ఎల్ ఆండ్ టీ 17 - హెచ్ ఎంఆర్ 15 ఏరియాల్లో పార్కింగ్ కాంప్లెక్సులు కడుతున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న నాగోల్ టు మియాపూర్ 30 కి.మీ రూట్లో ఎల్ ఆండ్ టీ 7 - హెచ్ ఎంఆర్ 6 పార్కింగ్ అండ్ సర్క్యులేషన్ను డెవలప్ చేస్తున్నాయి. 12 స్ట్రీట్ పార్కింగ్ - 11 కార్ పార్కింగ్ ఏరియాలను డెవలప్ చేయనున్నారు. ఎల్ ఆండ్ టీ - హెచ్ ఎంఆర్ ఆధ్వర్యంలో మూడు కారిడార్లలోని 17 స్టేషన్లలో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మాణం పూర్తి అయింది. నాగోల్ టు మియాపూర్ 30 కి.మీల స్ట్రెచ్ లో 24 స్టేషన్లున్నాయి. అయితే పార్కింగ్ విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామంటున్నారు అధికారులు. ఇక ఓలా - ఉబర్ తో పాటు ప్రైవేట్ వెహికిల్స్ ఆగేందుకు మెట్రో స్టేషన్స్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.