సాధారణంగా వీకెండ్ లో రెస్టారెంట్లలో రద్దీ అధికంగా ఉంటుంది. కొద్దిసేపు , క్యూలో నిలుచొని టోకెన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ, బ్యాంకాక్ లోని ఓ రెస్టారెంట్ లో భోజనం చేయాలంటే రైల్వే రిజర్వేషన్ లాగా మూడు నెలల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సిందే. ఓ భారతీయుడు నిర్వహించే ఆ రెస్టారెంట్ లో ప్రతిరోజూ సుమారు 500 మంది రిజర్వేషన్ చేసుకుంటారు.
కలకత్తాకు చెందిన గగన్ ఆనంద్ (38) ఉద్యోగం కోసం బ్యాంకాక్ కు వెళ్లాడు. స్వతహాగా చెఫ్ అయిన ఆనంద్ అక్కడ సొంతగా ‘గగన్’ అనే పేరుతో రెస్టారెంట్ పెట్టి విజయవంతంగా నడుపుతున్నాడు. అనతి కాలంలోనే గగన్ ఆసియాలో నంబర్ వన్ షెఫ్ గా పేరు గడించాడు.
2010 డిసెంబరులో ప్రారంభించిన ‘గగన్’ కు 2013లో ఆసియాలో 50 ఉత్తమ రెస్టారెంట్లలో పదో స్థానం దక్కింది. ప్రపంచంలో టాప్ 100లో 66వ స్థానం లభించింది. అంతే కాదు, గగన్ ఈ ఏడాది ఆసియాలో ప్రథమ స్థానంలో, ప్రపంచంలో ఏడో స్థానంలో నిలిచింది. వరల్డ్ టాప్ 50లో స్థానం పొందిన ఏకైక భారతీయ రెస్టారెంట్ ‘గగన్’ కావడం విశేషం.
భారతీయులకు వంటల పరంగా గొప్ప వారసత్వమున్నా కాలానికి తగినట్లుగా ఆధునికీకరించడం లేదని గగన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. త్వరలో ఇండియాలో హోటల్ పెట్టాలన్న ఆలోచన ఉందని తెలిపారు. గగన్ రెస్టారెంట్లో తాను రూపొందించిన ప్రత్యేకమైన మెనూ మాత్రమే ఉంటుందని చెబుతున్నాడు గగన్ ఆనంద్. ప్రయోగాలు చేయడం ఇష్టం లేని చోట సృజన రాణించదని ఆనంద్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/