గత నెల కిందట తెలంగాణలో రాజకీయ వేడి పెంచిన వైఎస్ షర్మిల.. ఆ తరువాత కూల్ అయిపోయినట్లు తెలుస్తోంది. సాదాసీదా మీటింగ్ లతో కాలం గడుపుతూ టైం వేస్టు చేస్తున్నారని కొందరు గుసగుసలు పెట్టుకుంటున్నారు. దీంతో ఆమెను ఇతర రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదని, మీడియా కూడా పెద్దగా కవరేజ్ ఇవ్వనందున ఆమె రాజకీయారంగేట్రం జరుగుతుందా..? లేక సమావేశాలతోనే సరిపెడుతారా..? అన్న చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం కూడా షర్మిల గురించి తెలసుకోవడం.. రోజూ రిపోర్టు ఇవ్వడం సుద్ద దండుగ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారంటే అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెరవేసే పని ఇంటెలీజెన్స్ చేస్తుంది. ఇటీవల షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరగడంతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్టీ పెడుతున్నానని షర్మిల డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకో జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఈమేరకు రిపోర్టు చేస్తోంది.
రెండు, మూడు రోజులుగా ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వాళ్లు షర్మిల సమావేశానికి వెళ్లడం లేదట. అక్కడ పెద్దగా తెలుసుకోవాల్సిన విషయాలేమీ లేవని అంటున్నారట. షర్మిల మీటింగ్ కు కనీసం మాజీ సర్పంచ్ స్థాయి లీడర్ కూడా రావడం లేదని, అలాంటప్పుడు అక్కడికి వెళ్లి నిఘా పెట్టడం సుద్ధ దండుగ అని అంటున్నారట. అంతే కాకుండా మీడియా కూడా పెద్దగా పట్టిచుకోకపోవడంతో షర్మిల ప్రభావం ఇతర పార్టీలపై, ముఖ్యంగా టీఆర్ఎస్ పై అసలే ఉండదని ఇంటెలిజెన్స్ చెబుతున్నారట.
అయతే మీడియాలో ఎక్కువగా ఫోకస్ కావడం లేదని గ్రహించిన షర్మిల ఏకంగా సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే కారు పార్టీవాళ్లు మాత్రం ఏమీ వినబడనట్టు ఉంటున్నారట. ఎందుకంటే షర్మిల దగ్గర ఉన్న సోషల్ మీడియా టీం ఆంధ్రాకు చెందిన వాళ్లున్నారు. తెలంగాణకు చెందిన వాళ్లు లేరు. అందుకే షర్మిల టీఆర్ఎస్ ను ఎలా తిట్టినా ఆమె నెట్టంట్లోకి వెళ్లడం లేదు. ఈ పరిస్థితుల్లో షర్మిలకు ఎవరైనా సలహాలు ఇస్తారా..? లేక షర్మిల తెలుసుకుంటారా..? అని చర్చించుకుంటున్నారు.