'వడ్డించేవాడు మన వాడైతే ఏ మూలకు కూర్చున్నా ఒక ముక్క ఎక్కువే పడుతుందనేది' తెలుగులో ఫేమస్ నానుడి. ఇప్పుడు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన రాష్ట్రానికి చెందిన అదానీ, అంబానీలు సంపదలో దూసుకుపోతూ.. కాంట్రాక్టులు దక్కించుకుంటూ దేశంలోనే అపర కుబేరులుగా మారిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంబానీ సంగతి ఏమో కానీ.. అదానీ అయితే ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతులైన అమెజాన్, టెస్లా అధినేతలను కూడా తోసిరాజని వారిని మించిన సంపదను ఒక్క సంవత్సరంలో సంపాదించాడంటే వారికి దేశంలో అవకాశాలు ఏ స్థాయిలో లభిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవలే భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ప్రపంచంలోని టాప్ 20 కుబేరుల జాబితాలో నిలిచినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరుతో మైనింగ్, పోర్టులు, పవర్ ప్లాంట్లు, డేటా సెంటర్లు, డిఫెన్స్ రంగాల్లో అదానీ తెగ రాణిస్తున్నాడు. మోడీ హయాంలో ఆయన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు వర్ధిల్లుతోందట..
2020లో 16.32 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద.. ప్రస్తుతం 59.9 బిలియన్ డాలర్లకు చేరిందంటే ఏ లెవల్ లో సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. గత ఏడాది ఇండియాలోనే ఎక్కువ సంపాదించిన వ్యక్తిగా అదానీ నిలిచేశాడు.