షాకిచ్చిన హ్యాకర్లు: మోడీని తిడుతూ సింధియా పోస్ట్

Update: 2021-07-10 09:30 GMT
ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ పునర్వ్యస్థీకరణలో అందరికంటే అందలం దక్కింది మధ్యప్రదేశ్ కు చెందిన జ్యోతిరాధిత్య సింధియాకే. మోడీ కూడా ఈ కాంగ్రెస్ మాజీ నేతకు పెద్దపీట వేశాడు. యువకుడైనా సరే కేంద్ర కేబినెట్ ర్యాంక్ పదవిని ఇచ్చి గౌరవించాడు. కేబినెట్ విస్తరణకు ముందు, ఆ తర్వాత కూడా జ్యోతిరాధిత్య సింధియా పేరు వార్తల్లో బాగా ప్రచారమైంది.

జ్యోతిరాధిత్య సింధియా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో మోడీని తిట్టినప్పటి పాత వీడియోను హ్యాకర్లు పోస్టు చేశారు. ఈ విషయమై గ్వాలియర్ లో పోలీస్ కేసు కూడా నమోదు కావడం తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఆయనకు అనూహ్య పరీక్ష ఎదురైంది.

శుక్రవారం బాధ్యతలు చేపట్టగానే సింధియాకు టాస్క్ ఎదురైంది. అయితే ఇది ఇచ్చింది ప్రధాని మోడీ కాదు.. అందరికీ టాస్క్ లు ప్రధాని ఇస్తుంటారు.కానీ సింధియాకు మాత్రం ముంబై హైకోర్టు ఈ టాస్క్ ఇచ్చింది.

దేశంలో విమానాశ్రయాలకు తరచూ పేర్లు మార్చుతుండటాన్ని సవాల్ చేస్తూ ముంబై హైకోర్టులో తాజాగా పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేరు మార్చే విషయంలో దేశవ్యాప్త విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని, ప్రత్యేకించి సింధియా విమానయానశాఖను ఆదేవించింది. దీనిపై వెంటనే నూతన విధానాన్ని ఏర్పాటు చేయాలని.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పౌరవిమానయాన శాఖ మంత్రికి ఇది మొదటి టాస్క్ కావాలి’ అని ముంబై హైకోర్టు ఆదేశించింది.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విమానాశ్రయాలకు వ్యక్తుల పేర్లు పెట్టకూడదని.. కేవలం నగరాల పేర్లు మాత్రమే పెట్టాలని 2016లో అప్పటి ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని అనుకుంది. కానీ సదురు విధానం ఇంకా అమలులోకి రాలేదు. దీంతోచాలా చోట్ల ఎయిర్ పోర్టుల పేర్ల మార్పులు చోటుచేసుకున్నాయి.

- వివాదం ఇదీ
ముంబై ఎయిర్ పోర్టుకు బాల్ థాకరే పేరును పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఫెడరిన్ అనే వ్యక్తి దీనిపై ముంబై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అసలు పేర్లు మార్చే విధానం ఏ దశలో ఉందని.. దానిపై నూతన విధానం తేవాలని హైకోర్టు విమానయాన శాఖను ఆదేశించింది.
Tags:    

Similar News