దేశంలో సెకెండ్ వేవ్ ఉదృతి తగ్గినట్లేనా .. ?

Update: 2021-05-17 10:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు నమోదు అయ్యే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గతంలో రోజు నాలుగు లక్షల కి పైగా పాజిటివ్ కేసులు వచ్చేవి , ఆ తర్వాత మూడు లక్షలకి తగ్గిపోయాయి. ఇక తాజాగా ఈ రోజు ఆ కేసుల సంఖ్య మూడు లక్షలకి దిగువగా వచ్చింది. గ‌త 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2.81 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు అయిన‌ట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. గ‌త వారంలో కేసుల సంఖ్య ప్ర‌తి రోజులూ మూడు ల‌క్ష‌ల‌కు పైనే న‌మోదు అయ్యింది. ఆదివారం కొత్త‌గా న‌మోదైన కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల లోపు కావ‌డం, అంత‌కు ముందు వారం కూడా స‌గ‌టున చూస్తే  కరోనా మహమ్మారి పాజిటివ్ రేట్ త‌గ్గ‌డంతో, దేశంలో సెకెండ్ వేవ్ క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయా అనే ఓ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

ఒక ద‌శ‌లో దేశంలో నాలుగు ల‌క్ష‌ల స్థాయిలో రోజువారీ కేసులు న‌మోద‌య్యాయి. చివ‌రి సారి ఏప్రిల్ 21న ఇండియాలో మూడు ల‌క్ష‌ల్లోపు స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. దాదాపు నెల త‌ర్వాత ఇలా కేసుల సంఖ్య అవ‌రోహ‌న క్ర‌మంలో మూడు ల‌క్ష‌ల్లోపుకు చేరింది. మే ద్వితీయార్థం నుంచి దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌ని వైరాల‌జిస్టులు త‌మ అంచ‌నాల్లో వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అదే జ‌రుగుతుండ‌వ‌చ్చ‌ని సామాన్యులు కూడా ఆశిస్తున్నారు.  నిన్న ఒక్క రోజే దేశంలో యాక్టివ్ కేసుల‌ సంఖ్య సుమారు ల‌క్ష త‌గ్గిపోయాయి. 2.81 ల‌క్ష‌ల కొత్త కేసుల రాగా, రిక‌వ‌రీల సంఖ్య అంత‌కు ల‌క్ష ఎక్కువ ఉంది. ఈ నేప‌థ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35 ల‌క్ష‌ల స్థాయికి చేరింది. అయితే, మ‌ర‌ణాల సంఖ్య మాత్రం గ‌త వారం స్థాయిల్లోనే కొన‌సాగింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 4 వేల‌కు మందికి పైగా మ‌ర‌ణించారు. గత వారంలో గ్రోత్ రేట్ త‌గ్గింద‌ని స్ప‌ష్టం అవుతోంది. అంత‌కంత‌కూ పెర‌గాల్సిన కేసుల సంఖ్య ఆ భ‌యాన‌క స్థాయిలో పెర‌గ‌డం లేద‌ని స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఈ వారం ప్రారంభంతో రోజువారీ కేసుల సంఖ్య‌లో మెరుగైన త‌గ్గుద‌ల న‌మోదైంది. మ‌రి ఈ వారంలో ఈ త‌గ్గుద‌ల‌లు కొన‌సాగితే, ఆసుప‌త్రుల‌పై కూడా కేసుల బరువు త‌గ్గే అవ‌కాశం ఉంది. క‌రోనా సెకెండ్ వేవ్ విష‌యంలో ఈ వారం ముగిసేలోపు ఓ అంచనాకి వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News