రేవంత్‌ వీడియో మీద జోరందుకున్న వాదనలు

Update: 2015-06-10 10:02 GMT
నేరం జరగటం.. దానికి సంబంధించి విచారణ శాఖలు కేసులు నమోదు చేయటం.. నిందితుల్ని అదుపులోకి తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత కోర్టులో జరిగే వాద.. ప్రతివాదాలు మరో ఎత్తు. ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియోలో కనిపించి.. డబ్బు సంచిలో డబ్బు మరో వ్యక్తి బయట పెట్టే సీన్‌ చూసిన వారిలో చాలామంది రేవంత్‌రెడ్డి చాఫ్టర్‌ క్లోజ్‌ అని అనుకున్నారు.

ఈ ఘటన వెలుగు చూసిన పదకొండు రోజుల తర్వాత కోర్టులో ఈ విషయం మీద జరుగుతున్న వాద.. ప్రతివాదనలు చూసినప్పుడు జరిగే నేరానికి.. కోర్టు జరిగే వాదనకు సంబంధించి ఇన్ని పాయింట్లు ఉంటాయా? అనిపించక మానదు. ఒకవ్యక్తి నేరం చేసినట్లు కనిపించినా.. దాన్ని నిరూపించటానికి ఎన్ని వాదనలు తెరపైకి వస్తాయన్న విషయం తెలిసినప్పుడు కాస్తంత ఆశ్చర్యం కలగటం ఖాయం. తాజాగా రేవంత్‌ వ్యవహారంలో ఆయన తరఫు లాయర్ల వాదన వింటే..

I నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మే 28న ఫిర్యాదు చేస్తే.. అదే రోజు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయకుండా ఉన్నారు?

I మే 31 సాయంత్రం మూడు వాహనాల్లో వచ్చిన వ్యక్తులు డబ్బు తెచ్చారని చెబుతున్నారు.. కానీ..  రేవంత్‌రెడ్డి వాహనంలో డబ్బు లేదు.

I మే 31 సాయంతం 4.40 గంటలకు రేవంత్‌ను అదుపులోకి తీసుకొని.. అదే రోజు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

I మే 29.. 30..31 తేదీల్లో ఆడియో రికార్డింగ్‌ చేశామన్నారని.. ఎఫ్‌ఐఆర్‌ లేకుండా ఆడియో రికార్డింగ్‌ ఎలా చేస్తారు?

I స్టీఫెన్‌ ఫిర్యాదులోనూ రేవంత్‌ తనను సంప్రదించలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఈ వ్యవహారంలో రేవంత్‌కు సంబంధం ఏమిటి?

I పీసీ యాక్ట్‌ 12 ఈ నేరానికి వర్తించదు.

I పీసీ యాక్ట్‌ 7.. 11 ప్రకారం నేరం నిర్ధారణ అయితేనే ఈ కేసులో సెక్షన్‌ 12 వర్తిస్తుంది.

I సెక్షన్‌ 7 ప్రకారం ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డు పెట్టుకని ప్రయోజనాలుకల్పిస్తే శిక్షార్హులు అవుతారు. రేవంత్‌ అధికారంలో లేరు.

I మరి.. అలాంటి సమయాల్లో సెక్షన్‌ 7.. 11ను ఎలా వర్తింపచేస్తారు.

I అడియో.. వీడియో టేపుల్లో ఓటు అడిగినట్లు ఉందని.. ఓటు అడగటం నేరం కాదు.

I పీపుల్స్‌ రిప్రంజంటేషన్‌ ప్రకారం ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేయాల్సిన కేసు. ఏసీబీ దర్యాప్తు చేయాల్సిన కేసు కాదు.

Tags:    

Similar News