డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.20 వేలు.. త్రిబుల్ బెడ్ రూం హౌస్ రూ.30 వేలు.. ఇవి నెలవారీ చెల్లించే అద్దెలు. కరోనా కారణంగా కొంతకాలంగా అద్దె ఇల్లులు పట్టించుకోని వారు ఇప్పుడు రెంటెడ్ హౌస్ కోసం ఎగబడుతున్నారు. వారు నిర్ణయించుకున్న ప్రదేశాల్లోనే నివాసం కోసం ఆరాటపడుతున్నారు. దీంతో ఇళ్ల యజమానులు అద్దెల రేట్లు విపరీతంగా పెంచారు. కరోనా కంటే ముందు ఉన్న రేట్లతో పోలిస్తే ఇప్పుడు 42 శాతం అధికంగా పెరిగింది. రేటు ఎంత ఎక్కువైన పర్వాలేదు.. పనిచేసే చోట ఉండాలని కొందరు కోరుకోవడం ఇళ్ల యజమానులకు వరంగా మారింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అద్దె రేట్లు మండిపోతున్నాయి.
దేశవ్యాప్తంగా నివాస సౌకర్యాలున్న ప్రాంతంగా బెంగుళూరు మొదటి ప్లేసును ఆక్రమించింది. ఆ తరువాత గ్రేటర్ నోయిడా తరువాత హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ బ్రిక్ష్ ఓ నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో అద్దె రేట్లు ఎలా పెరిగాయో తెలిపింది. ఇందులో హైదరాబాద్ లోని ముఖ్య ప్రాంతాలను లెక్కలోకి తీసుకుంది. ఆయా ప్రాంతాల అవసరాలను భట్టి అద్దె రేట్లు విపరీతంగా పెరిగాయని ఈ నివేదికలో పేర్కొంది.
మ్యాజిక్ బ్రిక్స్ సర్వే ప్రకారం.. ఐటీ ఉద్యోగులు పనిచేసే చోట ఉన్న నివాస గృహాల అద్దె రేట్లు అత్యధికంగా ఉన్నాయి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో డబుల్ బెడ్ రూం ఇల్లు అద్దెకు కావాలంటే రూ.20 వేలు చెల్లించాల్సిందే. అలాగే త్రిబుల్ బెడ్ రూం ఇల్లైతే రూ.30 వేలు కట్టాల్సిందే. ఇక గచ్చబౌలిలో రూ.20 నుంచి 29 వేలుద.. కొండాపూర్ లో రూ.17 వేల నుంచి రూ.24 వేలు..కోకాపేటలో రూ.19 వేల నుంచి రూ.25 వేలకు అద్దె రేట్లు ఫిక్స్ చేశారు. వీటితో పాటు మణికొండ, నార్సింగి, నల్లగండ్ల, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాల్లోని ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
అయితే కొందరు తమ అవసరాలకు అనుగుణంగా అద్దెను అడిగినంతా ఇస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ కు చెందిన వారు తమ కార్యాలయానికి దగ్గరగా ఉంటే ఎంత అద్దె ఉన్నా చెల్లిస్తున్నారు. ఇలా రూ.20 నుంచి 30 వేలు చెల్లించి అద్దెకు ఉండాలనుకున్నవారు 25 శాతం ఉన్నారు. వీటికి అందుబాటులో 45 శాతం ఇళ్లు ఉన్నాయి. రూ.10 నుంచి 20 వేల మధ్య ఇళ్లను కావాలనుకున్న వారు ఎక్కువగా 35 శాతం ఉన్నారు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకునే రూ.30 నుంచి రూ.40 వేలు చెల్లించాలనుకునేవారు 16 శాతం మంది ఉన్నారు.
లక్షల్లో జీతం ఉన్నవారు రూ.30 వేలకు పైగా ఉన్న అద్దె చెల్లించడానికి రెడీ అవుతున్నారు. అయితే తమ కార్యాలయాలకు దగ్గరగా ఉండడంతో పాటు విశాలమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఆ తరువాత కేటగిరీ కి చెందిన వారు జీతం ఎక్కువున్నా చిన్న ఇంట్లోనైనా అడ్జెట్ కావడానికి సిద్ధమవుతున్నారు. రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాటికి 64 శాతం ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లోని ఇళ్ల యజమానులకు ఇప్పుడు పండుగ వాతావరణం కలిగినట్లే కనిపిస్తోంది. కరోనా కాలంలో హైదరాబాద్ నుంచి చాలా మంది తమ ఇళ్లల్లోకి వెళ్లారు. దీంతో ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులు కనిపించాయి. కానీ ఇప్పుడు ఒకరు అద్దె గదిని విడిచిన తరువాత వెంటనే మరొకరు ఎంట్రీ ఇస్తున్నారు.