ఒక పక్షి.. విమానం ముక్కలవ్వడానికి కారణమైందా?

అక్టౌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది!

Update: 2024-12-25 14:45 GMT

అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ జే2 - 8243 ప్రమాదం ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాకు నుంచి బయలుదేరిన విమానం రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్ఞీ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో మృతులు, గాయపడినవారిపై ఓ క్లారిటీ రాగా.. పక్షి ఢీకొనడం వల్లే అనే విషయం తెరపైకి వచ్చింది.

 

అవును... గ్రోజ్ఞీలోని దట్టమైన మంచు కారణంగా ఆ విమానాన్ని దారి మల్లించగా.. అక్టౌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది! ఈ సమయంలో ఈ ప్రమాదానికి గల పలు కారణాలు తెరపైకి వస్తున్నాయి.

వేగంగా కిందికి దూసుకొచ్చి నేలను ఢీకొని ముక్కలుగా విరిగిపోయిన విమానంలో కీలకమైన వ్యవస్థలు విఫలం కావడంతోనే ప్రమాదం జరిగిందని నిపుణులు అనుమానిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... కీలకమైన కంట్రోల్స్ తో పాటు బ్యాకప్ సిస్టం విఫలమైనట్లు గుర్తించినట్లు ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ వెల్లడించింది.

మరోవైపు... ముందుగా ఈ విమానం ఓ పక్షిని ఢీకొందని.. ఈ నేపథ్యంలోనే పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ కు ప్రయత్నించారని.. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందంటూ రష్యా ఏవియేషన్ వాచ్ డాగ్ ను ఉటంకిస్తూ రాయిటార్స్ వెల్లడించింది. అయితే... ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తాము వెల్లడిస్తామని అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Tags:    

Similar News