లంచం ఇస్తేనే భోజనం... పోలీసులపై వసుంధర సంచలన ఆరోపణలు!
స్విట్జర్లాండ్ లో ప్రముఖ భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర గత ఏడాది అక్టోబర్ 1న ఉగాండాలో అరెస్టైన సంగతి తెలిసిందే.
స్విట్జర్లాండ్ లో ప్రముఖ భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర గత ఏడాది అక్టోబర్ నెలలో ఉగాండాలో అరెస్టైన సంగతి తెలిసిందే. కిడ్నాప్, హత్య మొదలైన అభియోగాలాపై ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కొన్నాళ్ల పాటు అమెను నిర్భందంలో ఉంచారు. నేపథ్యంలో తాజాగా ఉగాండ పోలీసులుపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
అవును... స్విట్జర్లాండ్ లో ప్రముఖ భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర గత ఏడాది అక్టోబర్ 1న ఉగాండాలో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదే నెల 21 ఆమెకు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఇక డిసెంబర్ 19న ఆమెపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది.
అయితే... ఈ ఘటన జరిగిన సుమారు నాలుగు నెలల తర్వాత తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాడు ఉగాండ జైల్లో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెబుతూ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా.. తనకు ఆహారం, నీళ్లు ఇవ్వడానికి కూడా లంచం అడిగి తీసుకున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా... నాడు పోలీసులు తమ ఇంటికి వచ్చి వారెంట్ లేకుండానే సోదాలు చేశారని.. సెర్చ్ వారెంట్ గురించి అడిగితే ఇది యూరప్ కాదంటూ ఇస్టానుసారంగా మాట్లాడారని.. ఇంటర్ పోల్ డైరెక్టర్ ను కలవాలంటూ బలవంతంగా బయటకు తీసుకొచ్చారని.. అనంతరం ఓ పురుష అధికారి తనను లాక్కెళ్లి వ్యాన్ లో పాడేశారని ఆమె తెలిపారు.
ఈ క్రమంలో ఐదు రోజుల పాటు తనను నిర్భందించారని.. అనంతరం మరో రెండు వారాలు జైలుకు పంపించారని.. ఆ సమయంలో తన ప్రాథమిక హక్కులకు తీవ్రంగా భంగం కలిగించారని వసుంధర వెల్లడించారు. ఆ సమయంలో తనను స్నానం చేయనివ్వలేదు.. తిండి పెట్టలేదు.. కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆమె తెలిపారు.
తనకు భోజనం, ఇతర కనీస సౌకర్యాలు కల్పించేందుకు సైతం పోలీసులకు నా తల్లితండ్రులు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. క్రిమినల్ లాయర్ ను అనుమతించకుండానే తనతో బలవంతంగా వాంగ్మూలం రాయించుకున్నారని.. ఒకానొక దశలు కనీసం వాష్ రూమ్ కు కూడా వెళ్లనివ్వలేదని ఆమె పేర్కొన్నారు.
మర్డర్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కేసుల్లో నేరాలు చేసినవారితో కలిపే తనను జైలు గదిలో ఉంచారని.. చనిపోయాడనుకున్న వ్యక్తి బ్రతికే ఉన్నాడని తెలిసినప్పటికీ తనను జైల్లోనే నిర్బంధించి ఉంచారని.. ఈ క్రమంలో ఎన్నో ప్రయత్నాల తర్వత చివరకు తనకు బెయిల్ లభించిందని వసుంధర తెలిపారు.
కాగా... నాడు పంకజ్ ఓస్వాల్ తన 26 ఏళ్ల కుమార్తె వసుంధర ను ఉగాండాలో అక్రమంగా బంధించారని.. జైలులో ఉంచారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఉగాండా అధ్యక్షుడికి బహిరంగ లేఖ రాశారు. ఇందులో.. తన కుమార్తె ప్రాథమిక హక్కులను హరించారని.. న్యాయ సహాయం పొందడానికి అనుమతించడం లేదని ఆరోపించారు.