నోట్ల రద్దు అనంతరం తమవద్ద ఉన్న నల్లధనాన్ని / అన్ అకౌంటెడ్ మనీ ని వైట్ మనీగా మార్చుకోవడానికి, లేదా దొడ్డిదారిలో పాత నోట్ల స్థానే కొత్త నోట్లను సమకూర్చుకోవడానికి నల్లబాబులు వేసిన స్కెచ్చులు అన్నీ ఇన్నీ కాదు. ప్రభుత్వం ఒకందుకు కేటాయించిన జన్ థన్ ఖాతాలను సైతం తమకు అనుగుణంగా నల్లబాబులు మార్చుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో తెలిసిన వారి అకౌంట్స్ కు వాయిదాల పద్దతిలో డబ్బులు వేసి అనంతరం తమ తమ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసుకుంటూ ఏదోకరకంగా తమ పాత నల్ల ధనాన్ని కొత్త నల్లధనంగా మార్చుకోవడానికి తమవంతు ప్రయయత్నాలన్నీ చేస్తున్నారు! ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఒకరు ఐటీ అధికారులకు చిక్కారు.. అతడి బ్యాంక్ ఖాతాలోని సొమ్ము వివరాలు చూసి అంతా షాకయ్యారు!!
అవును.. అతడు ఒక క్యాబ్ డ్రైవర్. అతని ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే నిన్న మొన్నటివరకూ వేలల్లోనూ, అడపా దడపా ఒకటి రెండు లక్షలతోనూ నడిచిన ఆ బ్యాంకు ఖాతాలో విడతలవారీగా ఈ మద్యకాలంలో సుమారు రూ. 7 కోట్ల నగదు డిపాజిట్ అయ్యింది. పెద్దనోట్ల రద్దు అనంతరం భారీమొత్తంలో నగదు డిపాజిట్ అయిన ఖాతాలపై ఆదాయపన్ను శాఖ ఒక కన్నువేసి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈమధ్య కాలంలో అధికమొత్తంలో డిపాజిట్ అయిన ఖాతాలపై దృష్టిపెట్టగా.. వాటిలో ఒక డ్రైవర్ కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఖాతాలో ఏకంగా రూ. 7 కోట్లు వెలుగుచూసింది!
విషయం గ్రహించిన అధికారులు ఆ డ్రైవర్ ను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 8వ తేదీ అనంతరం రద్దైన రూ. 500 - రూ. 1000 నోట్లను తన ఖాతాలో వేసుకున్న ఆ డ్రైవర్ ఆ మొత్తం సొమ్మును దశలవారీగా ఒక బంగారం వ్యాపారి ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించిన అధికారులకు.. ఈ డ్రవర్ తో పాటు నగదు డిపాజిట్ సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా వస్తున్నట్లుగా గుర్తించారు. వారిని కూడా పట్టుకుని ఆరాతీయగా... సంతృప్తికరమైన సమాధానాలు ఐటీ శాఖకు వారినుంచి రాలేదు. దీంతో ఆ డబ్బు మొత్తాన్ని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద పన్ను కట్టేందుకు క్యాబ్ డ్రైవర్ అంగీకరించాడని, ఆ మొత్తంలో పెనాల్టీ కింద రూ. 3.5 కోట్లు పీఎంజీకేవై కు కట్టాల్సి ఉండగా, మరో 25శాతం నాలుగేళ్లపాటు లాకిన్ డిపాజిట్ గా ఉంచాల్సి ఉంటుందని చెబుతున్నారు ఐటీ అధికారులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/