వైరస్ లో దూసుకెళ్తున్న భారత్: కొత్తగా 15,968 కేసులు

Update: 2020-06-24 06:15 GMT
వైరస్ వ్యాప్తి దేశంలో ఉధృతంగా సాగుతోంది. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ కేసుల నమోదులో భారత్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ టాప్ లో నిలిచేందుకు దూసుకెళ్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతున్నాయి. తాజాగాబుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం ఒక్క రోజులో 15,968‬ పాజిటివ్ కేసులు నమోదవగా.. ‬465 మరణాలు సంభవించాయి.

వీటితో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,561,83కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 10,495 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు  1,83,022‬ ఉండగా.. మరణించిన వారి సంఖ్య 14,476 మంది. వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జయిన వారి సంఖ్య 2,58,684.

నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 1,39,010 పాజిటివ్ కేసులు నమోదవగా.. మృతులు 6,531 మంది. దేశ రాజధాని ఢిల్లీ కేసుల నమోదులో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో 66,602 కేసులు, 2,301 మరణాలు సంభవించాయి. తమిళనాడులో 64,603 కేసులు నమోదు కాగా, 833 మంది మరణించారు. వీటి తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అత్యధిక కేసులు నమోదయ్యేవిగా నిలిచాయి. వైరస్ మృతులు అత్యధికంగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఉన్నాయి.
Tags:    

Similar News