చలో ఆస్ట్రేలియా అంటోన్న భారతీయ విద్యార్థులు

Update: 2019-04-01 16:27 GMT
ఒకప్పుడు విదేశీ విద్య అనగానే మన అందరికి అమెరికానే గుర్తుకువచ్చేది. అక్కడకు చదువు పేరుత వెళ్లడం, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవడం మన భారతీయులకు అలవాటు అయిపోయింది. అయితే అదంతా మొన్నటివరకు. ఎప్పుడైతే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాడో అప్పటినుంచి ఇండియన్‌ స్టూడెంట్స్‌ కు వీసా రావడం కష్టమైపోయింది. ఒకవేళ వచ్చినా అమెరికాలో ఉద్యోగం చేయడం కుదరదని ట్రంప్‌ మాటిమాటికి రూల్స్‌ మారుస్తుండడంతో.. మనవాళ్లకు అమెరికా అంటేనే చిరాకొచ్చేసింది. ఇక మొన్నటికి మొన్న ఒక ఫేక్‌ యూనివర్శిటీ సృష్టించి మనవాళ్లని అడ్డంగా బుక్‌ చేయడంతో.. అసలు అమెరికా అంటేనే భయపడిపోతున్నారు విద్యార్థులు. ఇలాంటి టైమ్‌ మన విద్యార్థుల్ని రా రమ్మని అహ్వానిస్తోంది అస్ట్రేలియా.
          
గతంతో పోలిస్తే ఆస్ట్రేలియాకు ప్రతీ ఏడాది వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో లక్ష మంది వరకు అప్లై చేసుకుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. అన్నింటికి మించి అక్కడి ప్రభుత్వం మన విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు  ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఇస్తోంది. ఇందుకోసం అడిషనల్‌ టెంపరరీ గ్యాడ్యుయేట్‌ అనే పేరుతో చదువు పూర్తైన తర్వాత మరో ఏడాది పాటు ఉద్యోగం చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. దీంతో మనవాళ్లు పెర్త్‌ - మెల్‌ బోర్న్‌ -  గోల్డ్‌ కోస్ట్‌ - బ్రిస్‌ బేన్‌ - సిడ్నీ లాంటి నగరాల్లోని యూనివర్శిటీల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోపాటు అక్కడ స్కాలర్‌ షిప్‌ కూడా ఇస్తున్నారు. ఒకవేళ చదువు పూర్తై ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడే స్థిరపడాలన్నా కూడా అందుకే ఆస్ట్రేలియన్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. అయితే.. ఈ కొత్త తరహా నిబంధనలు అన్నీ 2021 నుంచి అమల్లోకి వస్తాయి. బాగా కష్టపడే తత్వం, అద్బుతమైన మేథస్సు ఉన్న భారతీయ విద్యార్థులు తమ దేశానికి వచ్చి చదువుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఆసక్తితో ఉంది.   
Tags:    

Similar News