విద్యార్ధుల్లో పెరిగిపోతున్న టెన్షన్

Update: 2022-10-12 04:58 GMT
వేలాదిమంది విద్యార్ధుల్లో రోజురోజుకు  టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే చైనాకు డైరెక్టుగా విమానాలు లేకపోవటమే. ఇంతకీ విషయం ఏమిటంటే చైనాలో చదువుతున్న భారత విద్యార్ధుల సంఖ్య 23 వేలు.

వీళ్ళల్లో అత్యధికులు మెడిసిన్ చదువుతున్నవారే. మిగిలిన వాళ్ళు డెంటల్, ఫార్మసీ  తదితర కోర్సులు చదువుతున్నారు.  వీళ్ళు కాకుండా మరికొన్ని వేలమంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.  

కోవిడ్ వైరస్ కారణంగా వీళ్ళంతా భారత్ కు తిరిగి వచ్చేయాల్సొచ్చింది. కోవిడ్ కారణంగా చదువులు అస్తవ్యస్ధంగా తయారైపోయాయి. ఇపుడిపుడే పరిస్దితులు చక్కబడతున్నాయని అనుకుంటున్నారు. అయితే చైనాలోని కొన్ని నగరాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించారు. అంటే లాక్ డౌన్ విధించిన నగరాల్లోని కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులంతా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భారత్-చైనా మధ్య విమానాలన్నింటినీ రద్దుచేసేశారు.

కొన్ని దేశాల నుండి చైనా డైరెక్ట్ విమానాల సర్వీసులను పునరుద్ధరించింది కానీ ఇండియా నుండి మాత్రం విమానాలను అంగీకరించటంలేదు. ఇపుడు ఇండియా నుండి చైనాకు ఎవరన్నా వెళ్ళాలంటే వాళ్ళంతా సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాలకు చేరుకుని అక్కడి నుండి చైనాకు వెళ్ళాల్సొస్తోంది. దీంతో విమాన టికెట్ల ధరలు మోతమోగిపోతోంది. పైగా విదేశాల నుండి ఎవరు వచ్చినా సరే కచ్చితంగా వారంరోజుల సెల్ఫ్ క్వారంటైన్లో ఉండి తీరాల్సిందే.

చైనాకు విమానంలో వచ్చిన ప్రతి ప్యాసెంజర్ కు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ అని బయటపడితే వెంటనే ఆ దేశానికి ఏకంగా విమానసర్వీసునే ఆపేస్తోంది. ఇలాంటి అనేక కఠినమైన నిబంధనలను పెట్టుకుని చైనాలో జీరో కోవిడ్ పాలసీని డ్రాగన్ అమలుచేస్తోంది.

ఇలాంటి అనేక కఠినమైన నిబంధనల కారణంగా భారత్ నుండి వేలాదిమంది విద్యార్ధులు చైనాలోకి ఎంటర్ కాలేకపోతున్నారు. దీనివల్ల ఇప్పటికే వాళ్ళ చదువులు పూర్తిగా దెబ్బతినేశాయి. ఒకవైపు ఉక్రెయిన్లో చదువుతున్న 25 వేలమంది విద్యార్ధుల భవిష్యత్తు దెబ్బతినేసింది. వాళ్ళకి తోడుగా ఇపుడు చైనాలో చదువుతున్న వేలాదిమంది కలిశారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News