ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్? నిజమేనా?

Update: 2020-06-22 14:00 GMT
తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఏపీలో ఇంకా బోణీ కాలేదు అని ఎదురుచూస్తున్న వారికి తాజాగా ఒక వార్త కలకలం రేపింది. ఏపీలోని ఓ ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే అది అధికారికంగా ప్రభుత్వం కానీ.. ఆయన కానీ ధ్రువీకరించలేదు.

విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబొండ శ్రీనివాసరావుకు కరోనా సోకినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ఇంతవరకు దీనిపై అధికారికంగా స్పందించలేదు. కరోనానా లేక సాధారణ దగ్గు - జ్వరమా అని కన్ఫం చేయలేదు.

అదే నిజమైతే ఏపీలో ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకడం ఇదే ప్రథమం అవుతుంది.  ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇటీవలే తన వ్యక్తిగత పనినిమిత్తం అమెరికా వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉండి ఇటీవలే వచ్చారు. అనంతరం కొన్నాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన విశాఖ శివారుల్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడట.. తనకు కరోనా పాజిటివ్ అన్న వార్తలపై ఎమ్మెల్యే శ్రీనివాసరావు  స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు.


Tags:    

Similar News