ఏపీలో అధికార పక్షం టీడీపీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల తూటాలు మరింతగా పేలిపోతున్నాయి. పక్కా లెక్కలతో, టీడీపీ ప్రభుత్వమే రూపొందించిన లెక్కలతోనే దాడి చేస్తున్న జగన్ వైఖరితో టీడీపీ సర్కారు ఎప్ప టికప్పుడు ఆత్మరక్షణలోనే పడిపోతోంది. నిన్నటికి నిన్న బాబు నోట వినపడిన అవినీతి మాటను ఆధారం చేసుకుని జగన్ చేసిన దాడితో టీడీపీ సర్కారుకు దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. నేటి సమావేశంలోనూ జగన్ తనదైన వాణిని వినిపించారు. ఈ దఫా కూడా నేరుగా చంద్రబాబును, ఆ తర్వాత బాబు సర్కారు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ జగన్ చేసిన కామెంట్లకు టీడీపీ నేతల నోట మాట రాలేదనే చెప్పాలి.
విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసే విషయంలో టీడీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించిన జగన్... టీడీపీని బెంబేలెత్తించారనే చెప్పాలి. పవర్ ప్రాజెక్టులతో చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ఒప్పందాలను ప్రస్తావించిన జగన్... వాటి రేట్లను, అదే సమయంలో అంతకుముందు జరిగిన ఒప్పందాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వాదనను వినిపించారు. జగన్ వాదనను తప్పుగా అర్థం చేసుకున్న బాబు కేబినెట్ లోని ఓ మంత్రి... భవిష్యత్తులో చేసుకోబోయే ఒప్పందాలు ఇప్పుడెందుకంటూ సెటైర్ వేసే యత్నం చేశారు. ఈ ఒప్పందాలపై సదరు మంత్రి అర్థం చేసుకున్న తీరుపై విస్మయం వ్యక్తం చేసిన జగన్... వెనువెంటనే లేచి తనదైన శైలి వాణి వినిపించారు.
తానేదో భవిష్యత్తులో జరిగే ఒప్పందాల గురించి మాట్లాడటం లేదని చెప్పిన జగన్... ఇప్పటికే చంద్రబాబు సర్కారు చేసుకున్న ఒప్పందాలను ప్రస్తావిస్తున్నానని, వాటిని ఇతర రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలతోనే పోలుస్తున్నానని చెప్పుకొచ్చారు. గతంలో ఏ ఒక్క ఒప్పందంలో కూడా ఒక్కో మెగా వాట్ కు రూ.4.67 కోట్లు మించలేదన్న జగన్... పొరుగునే ఉన్న తెలంగాణ,. గుజరాత్ - ఇతర రాష్ట్రాలు కూడా ఈ రేటు కంటే కూడా తక్కువ ధరకే ఒప్పందాలు చేసుకున్నాయని తెలిపారు. ఈ ఒప్పందాలకు విరుద్ధంగా బాబు సర్కారు మాత్రం ఒక్కో మెగావాట్ కు రూ.6.35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కంటే కూడా బాబు జమానాలోనే ఈ తరహా ధరలు ఉండటానికి కారణాలు కూడా ఉన్నాయని చెప్పిన జగన్... వాస్తవ ధరల కంటే ఎక్కువగా ఉన్న మొత్తమంతా బాబు అండ్ కోకు కిక్ బ్యాగ్‌ల రూపంలో దొడ్డిదారిన నిధులందించేందుకేనని చెప్పారు. బాబు సర్కారుకు కిక్ బ్యాగ్ లు అందాయని జగన్ చెప్పగానే... సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అదే సమయంలో ఏం చెప్పాలో తెలియక టీడీపీ నేతల నుంచి ఒక్క స్వరం కూడా వినిపించిన దాఖలా కనిపించలేదు. ఒక్కో మోగా వాట్ కు రూ. 2 నుంచి రూ.3 కోట్ల మేర బాబుకు కిక్ బ్యాగ్స్ అందాయని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ఓట్లకు నోటు కేసును ప్రస్తావించిన జగన్... నల్ల డబ్బుతో అడ్డంగా దొరికింది తానేనని, సూట్ కేసుల్లో నల్ల డబ్బు పెట్టుకుని తెలంగాణ పోలీసులకు దొరికింది కూడా తానేనని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్య లకు అసలు టీడీపీ నుంచి కనీసమాత్రంలో కూడా కౌంటర్ కనిపించకపోవడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/