బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని తుచ తప్పకుండా అమలు చేస్తున్న అరుదైన ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి ఆదిమూలపు సురేష్ కొనియాడారు. జగన్ త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాల కారణంగా ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రంలో మేలు జరుగుతోందని అన్నారు.
సర్కార్ బడులలో చదివే పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలన్న జగన్ సంకల్పం అంబేద్కర్ స్పూర్తిగానే చూడాలని అన్నారు. రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంక్ గానే చూసారని మంత్రి మండిపడ్డారు అంబేద్కర్ గొప్ప దార్శనీకుడని, ఆయన గురించి ఏమీ తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని సురేష్ అన్నారు.
రాష్ట్రంలో దళితుల పట్ల వివక్ష అన్నది లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. దళితులకు మేలు చేస్తామని మాటలు చెప్పేవారి కంటే చేతలలో చూపిస్తున్న జగన్ మేటి నాయకుడు అని కొనియాడారు. రాష్ట్రంలో ఉద్యోగులకు పీయార్సీని త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలియచేశారు.