ఏపీ అధికారపక్షం తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి చూస్తే.. మరే పథకం మీదా జరగనంత చర్చ.. రచ్చ జరిగింది మాత్రం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మీదనే. బోలెడన్ని అనుమానాలు తీసుకొచ్చిన ఈ పథకంతో ప్రభుత్వానికి మేలు జరుగుతుందని జగన్ సర్కారు ధీమాగా ఉంది.
ఈ పథకాన్ని ప్రకటించినంతనే పెద్ద ఎత్తున విమర్శలు మాత్రమే కాదు.. భారీగా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఈ పథకాన్ని అమలు చేయటం మీద జగన్ ప్రభుత్వం కమిట్ మెంట్ తో ఉంది.
తాజాగా ఈ పథకాన్ని ఈ రోజు నుంచి ఏపీలో అమలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు.. విమర్శకులు.. విపక్షాలు చెప్పే మాటలకు భిన్నంగా ఈ పథకం గురించి జగన్ సర్కారు చెబుతోంది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగే కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనుున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్థి పొందిన 8.26 లక్షల మందికి ఈ రోజు (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలు అందనున్నాయి.
నిజానికి ఈ కార్యక్రమం దేశంలో మరే రాష్ట్రంలో లేదని చెబుతున్నారు ఏపీ అధికారపక్ష నేతలు. వారి మాటల్లో చెప్పాలంటే.. ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు పేదల ఇళ్లకు కేవలం ‘నివసించే హక్కులు’ మాత్రమే ఇచ్చాయి. ఆ ఇంటి విలువ రూ.2 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఉన్నప్పటికీ ఇల్లు, ఇంటి స్థలాన్ని అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది కాదు.
ఆ ఆస్తి మీద సర్వహక్కులు పొందలేని దుస్థితి కూడా. కేవలం నామమాత్రపు రుసుముతో సీఎం వైఎస్ జగన్ సర్కారు పేదల రుణాలు, వడ్డీలు అన్నీ మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయిస్తూ వారి ఇంటిపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయించారు’’ అని చెబుతున్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా కలిగే ప్రయోజనాలు భారీగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం వినిపిస్తున్న వాదనను చూస్తే.. ఏమేం ప్రయోజనాలు కలుగుతాయన్నది చూస్తే..
- గతంలో నివసించే హక్కు స్థానంలో నేడు లబ్థిదారునికి తన ఇంటిపై సర్వ హక్కులు రానున్నాయి.
- తాజా పథకం పుణ్యమా అని.. లబ్థిదారుడు ఇంటిని అమ్ముకోవచ్చు. బహుతిగా ఇవ్వొచ్చు. వారసత్వంగా అందించొచ్చు. అవసరమైతే తాకట్టు పెట్టి అప్పు తీసుకోవచ్చు.
- దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ.6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ.16,000 కోట్ల లబ్ధి కలుగుతుంది.
- 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. అసలు, వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా గ్రామాల్లో కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే చాలు.
మిగిలిన మొత్తం మాఫీ. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్ చార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీచేస్తూ పూర్తి హక్కులు కల్పిస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులులేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ.10కే సర్వహక్కులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
- లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరంలేదు.
- లబ్ధిదారుడి స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా (22–ఏ నిబంధన) నుండి తొలగిస్తున్నారు.