టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై - ఏపీలో ఆయన సాగిస్తున్న పాలనపై - ప్రత్యేకించి ప్రతి అంశంలోనూ యూటర్న్ తీసుకుంటున్న చంద్రబాబు వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శల దాడి మొదలైపోయింది. నిన్నటిదాకా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబుపై ఆ పార్టీకి చెందిన నేతలే మాట్లాడేవారు. విపక్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడంతో పాటుగా వాటిపై బాబు మార్కు పాలన ఏ విధంగా సాగుంతుందన్న వైనంపై సూటిగానే విమర్శలు గుప్పించేవారు. అయితే టీడీపీ అనుకూల మీడియా ఈ విమర్శల కవరేజీని బాగా తగ్గించేసి చూపేది. అయితే నిన్న టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు... చంద్రబాబు చేసిన భారీ దాడిని టీడీపీ అనుకూల మీడియా కూడా కవర్ చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అదే సమయంలో టీడీపీ నేతలు టీఆర్ ఎస్ పై చేసిన ఎదరుదాడిని భూతద్దంలో చూపే యత్నం చేసింది. ఎన్ని చేసినా కూడా నిన్నటి కేసీఆర్ వ్యాఖ్యలు టీడీపీలో ప్రత్యేకించి చంద్రబాబులో ఓ భయాన్ని అయితే రేకెత్తించాయని చెప్పాలి.
తాజాగా జగన్ కూడా నేటి తన పాదయాత్రలో భాగంగా పలాసలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కీలక అంశాలు - సమస్యలను ప్రస్తావించిన జగన్... చంద్రబాబు సర్కారు కుట్రలను ప్రజల ముందు పెట్టారు. సిక్కోలు వాసులను అతలాకుతలం చేసిన తీతలీ తుఫానును ప్రస్తావించిన జగన్... తుఫాను కారణంగా రూ.3450 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదించిన చంద్రబాబు సర్కారు... ఇప్పటిదాకా బాధితులకు అందించిన సాయం రూ.500 కోట్లేనని చెప్పారు. ఆ రూ.500 కోట్లను కూడా బాధితులకు చెక్కుల రూపేణా అందజేసిన చంద్రబాబు... ఆ చెక్కుల్లో డబ్బులు కూడా వేయలేదని - మొత్తంగా బాధితుల పేరు చెప్పుకుని కూడా చంద్రబాబు దగాకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇంతటి దుర్మార్గ పాలనను సాగిస్తున్న చంద్రబాబు...శవాల మీద పేలాలు ఏరుకునే రకమేనని కూడా జగన్ కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. తుఫానులో సర్వస్వం కోల్పోయిన బాధితులకు చంద్రబాబు సర్కారు ఇప్పటిదాకా చేసిందేమీ లేదని కూడా జగన్ ఆరోపించారు.
పలాస జీడిపప్పుకు ప్రసిద్ధి చెందిందని - అయితే టీడీపీ పాలనలో ఈ ప్రాంతం ట్యాక్స్ ఫేమస్ గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస ఎమ్మెల్యే అల్లుడి గిల్లుడును తట్టుకోలేకపోతున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారని తనదైన శైలి కామెంట్లు చేసిన జగన్... ఆ ఎమ్మెల్యే అల్లుడి పేరు వెంకన్న చౌదరి అని - ఇక్కడ ఏం చేయాలన్నా ఆయనకు ట్యాక్స్ కట్టి చేయాల్సిన పరిస్ధితులు దాపురించాయని ధ్వజమెత్తారు. ఇదే జీడిపప్పు పైనే చంద్రబాబును కార్నర్ చేసిన జగన్... హెరిటేజ్ వ్యవహారాన్ని కూడా బయటకు లాగారు. బయట మార్కెట్ లో కేజీ జీడిపప్పు 600కు తక్కువగా ఉంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో మాత్రం 1100 ఉంటుందన్న జగన్... దళారీ వ్యవస్థను అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రే పెద్ద దళారీగా తయారైయ్యారని విమర్శించారు. పలాస - ఇచ్చాపురం - టెక్కలి ప్రాతంలో కిడ్నీ బాధితులు ఉన్నారన్న జగన్... వారికోసం గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. డయాలసిస్ సెంటర్ - కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని చంద‍్రబాబు చేసిన వాగ్దానాలను ప్రస్తావించిన జగన్... నాలుగున్నరేళ్ల కాలంలో వాటికి పునాదిరాయి కూడా పడలేదని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ప్రస్తావించిన జగన్... చంద్రబాబుకు తోడు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కూడా కిడ్నీ బాధితుల కోసం ఇక్కడికి వచ్చాడని. కానీ చేసేందేమీ లేదని విమర్శించారు. బాబుకు కష్టం వచ్చినపుడల్లా ఆయన పార్టనర్ గానే పవన్ ఇక్కడికి వస్తున్నాడని కూడా జగన్ కాస్తంత ఘాటు విమర్శలే చేశారు.
ఇక ప్రత్యేక హోదాకు సంబంధించి నిన్నటి మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను - వాటిపై చంద్రబాబు స్పందనను కూడా ప్రస్తావించిన జగన్... అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆది నుంచి పోరాడుతున్నది ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్న టీడీపీ నేతలు... వారికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రకటననను స్వాగతించాల్సిందిపోయి విమర్శించడం ఎందుకని కూడా జగన్ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాసేందుకు కూడా సిద్ధమని కేసీఆర్ ప్రకటిస్తే... ఆ లేఖ రాయమని కోరడంతో పాటుగా టీఆర్ ఎస్ ఎంపీల మద్దతుతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు... హోదాకు మద్దతుగా నిలుస్తామని చెబుతున్న కేసీఆర్ ప్రకటనను స్వాగతించడం మాని... దానిపై రాజకీయం చేయడం సబబేనా అని నిలదీశారు. మొత్తంగా నేటి తన ప్రసంగంలో చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై జగన్ గట్టిగానే విమర్శలు గుప్పించారు.
Full View