అమ్మ ఆరోగ్యం నిజంగా అలా ఉందా?

Update: 2016-12-05 14:57 GMT
జ‌య‌ల‌లిత‌...ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ సామ‌న్యుల చేత మేడ‌మ్ అనిపించుకోకుండా అమ్మ అని ఆప్యాయ‌త‌తో పిలిపించుకునే గౌర‌వం పొందిన నాయ‌కురాలు. దుర‌దృష్ట‌వశాత్తు ఆమె ఆరోగ్యం ఇబ్బందుల పాల‌వ‌డం, తాజాగా ప‌రిస్థితి మ‌రింత క్షీణించిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ‌టంతో వ‌స్తున్న స్పంద‌న‌పై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. అధికారిక ప్ర‌క‌ట‌న వెల‌వ‌డ‌క‌ముందే మ‌ర‌ణించిదంటూ కొన్నిటీవీ చాన‌ల్లు ప్ర‌క‌టించ‌డం, ప‌లువురు సినీ న‌టులు సంతాపం తెలియ‌జెప్ప‌డం గ‌మ‌నార్హం.

జ‌య‌ల‌లిత ఆరోగ్యంపై ఉత్సాహం కంటే గంద‌ర‌గోళం నెల‌కొల్ప‌డంపైనే ఎక్కువ‌గా దృష్టి సారించార‌ని పలువురు పేర్కొంటున్నారు. అప్పుడే ప‌రిస్థితి విష‌మం అని ప్ర‌క‌టించ‌డం, అనంత‌రం కోలుకుంటుంద‌ని వైద్యులు చెప్ప‌డంతో ఇది ప్రారంభ‌మైంద‌ని చెప్తున్నారు. స‌హ‌జంగానే దీన్ని కొంద‌రు చిలువ‌లు ప‌లువలు చేశార‌ని త‌ప్పుప‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో డీఎంకే కార్యాల‌యంలో పార్టీ ప‌తాకం అవ‌న‌తం చేశార‌నే స‌మాచారం దీనికి ఆజ్యం పోసింది. ఈ క్ర‌మంలో నెల‌కొన్న ఉత్కంఠను మీడియా, సోష‌ల్ మీడియా మ‌రింత పెంచింద‌ని చెప్తున్నారు. ఇంత‌కీ అమ్మ ప‌రిస్థితి రాష్ట్ర ప్ర‌భుత్వం, అధికార అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తే బాగుండేద‌నేది మెజార్టీ అభిప్రాయం.

ఇదిలాఉండ‌గా తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌య‌ల‌లిత ఆరోగ్యం విష‌మించిన‌ప్ప‌టికీ నిపుణులైన వైద్యుల‌తో శ‌స్త్రచికిత్స కొన‌సాగుతోంది. అపోలో వైద్యుల స‌మాచారం ప్ర‌కారం ఆమె చ‌నిపోయింద‌నే ప్ర‌చారం త‌ప్పు అని తేలుతోంది.
Tags:    

Similar News