ఇండియాలో టాప్ సీఎం... కేసీఆర్

Update: 2016-02-20 06:38 GMT
 దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ముఖ్యమంత్రులకు ఉన్న ప్రజాదరణపై జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కేసీఆర్ కు 83శాతం ప్రజాదరణ ఉందని ఇండియా టుడే నిర్వహించిన ''మూడ్ ఆఫ్ ది నేషన్'' సర్వేలో వెల్లడైంది.

అలాగే అధికారం చేపట్టిన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ ప్రజాదరణ క్రమేపీ తగ్గుతున్నదని కూడా ఈ సర్వేలో తేలింది. గత ఏడాది ఆగస్టు నెలతో పోలిస్తే ప్రస్తుతం మోడీ ప్రజాదరణ మూడు శాతం తగ్గిందని ఆ సర్వే పేర్కొంది. మరో వైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రజాదరణ గత ఆగస్టులో 8 శాతం ఉండగా ఇప్పుడు అది 22 శాతానికి పెరిగింది. కాగా ఇప్పటికే వచ్చే టెర్ములోనూ ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు అంటే 40 శాతం మంది మోడీ పేరే చెప్పగా రాహుల్ ను కోరుకుంటున్నవారు 22 శాతమే కనిపించారు.
Tags:    

Similar News