లాక్ డౌన్ వేళ తెలంగాణలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పనిగా చెప్పటం తెలిసిందే. తాను చెప్పేవన్ని ఉత్త మాటలుగా కాగా.. చేతల్లోనూ చేసి చూపించాలన్న ఆలోచనలో ఉన్న ఆయన.. తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెల్లకార్డు ఉన్న వారికి ఉచిత బియ్యంతో పాటు.. ఆర్థిక సాయాన్ని అందిస్తున్న వైనం తెలిసిందే.
వివిధ కారణాలతో గతంలో ప్రభుత్వం రద్దు చేసిన రెండు లక్షల తెల్ల రేషన్ కార్డుల వారికి సైతం తాజాగా సాయం చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తెల్లకార్డు రద్దు అయిన పేదలకు సాయం అందేలా తాజా నిర్ణయం ఉన్నట్లు చెబుతున్నారు. వివిధ కారణాలతో కార్డు రద్దు అయిన ఎన్నో కుటుంబాల వారికి సాంత్వన కలిగేలా తాజా నిర్ణయం ఉన్నట్లు చెబుతున్నారు.
కేసీఆర్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో.. గడిచిన మూడు నెలలుగా సాయం అందని వారికి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే బియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు తెలంగాణలో దాదాపు రెండు లక్షల కుటుంబాల వారు ఉంటారని చెబుతున్నారు. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోని వారి కార్డులు బ్లాక్ అయిపోతాయి.
కొన్ని సందర్భాల్లో రేషన్ తీసుకునే అవకాశం లేని వారు.. వ్యక్తిగత సమస్యలతో ఉన్న వారు రేషన్ తీసుకోరు. అలాంటి వారి కార్డులు బ్లాక్ అయిపోయాయి. వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వైనం ప్రభుత్వం వరకూ వెళ్లింది. దీంతో.. స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అలాంటి వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా.. ఈ నెల నుంచి అలాంటి వారికి సైతం రేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.