తెలంగోనళ్లకు పైసలు లేకున్నా అప్యాయత, ప్రేమానురాగాలు, నమ్మితే ప్రాణమిచ్చే గుణాలు ఎక్కువ అని ఏపీకి చెందిన ప్రముఖ రచయిత, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎక్కడికెళ్లినా కుల మతాలు అడగకుండా నీళ్లిస్తారని.. భోజనం చేయమంటారని చెబుతుంటారు. ఏపీలో ఆ సంస్కృతి లేదని వివరించాడు. ఆ తెలంగాణ సంస్కృతిని బాగా వంటపట్టించుకున్న సీఎం కేసీఆర్ సైతం తన ప్రగతి భవన్ ఇంటికి ఎవరు వచ్చినా అదిరిపోయే తెలంగాణ వంటకాలను వడ్డించి వారి కడుపు నింపి పంపుతుంటారు. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను కూడా ఇలానే కూల్ చేశాడు. అందుకే కేసీఆర్ తో భోజనం అంటే అందరూ తెగ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.
ఏది చేసినా డిఫెరెంట్ గా తన మార్క్ కనిపించేలా చేయడం కేసీఆర్ కు అలవాటు. అందుకే దేశం గర్వించే రైతు బంధు, మిషన్ భగీరథ నుంచి ఎన్నో అద్భుత పథకాలకు పురుడు పోశారు. ఇప్పటికే నలుగురిలోకి భిన్నంగా వెళ్లడం కేసీఆర్ కు అలవాటు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో పాల్గొనే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. దేశంలోని మొత్తం 8మంది సీఎంలను పిలిస్తే అందులో కేసీఆర్ ఉండడం విశేషం. ఊరికే ట్రంప్ వద్దకు ఎగేసుకుంటూ వెళితే ఏం కిక్కు ఉంటుంది. ఇది కేసీఆర్ కదా.. అందుకే ట్రంప్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట..
అమెరికా అధ్యక్షుడితో విందుకు వెళుతున్న కేసీఆర్ ఆయనకు ఇచ్చే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటేలా అద్భుతమైన బహుమతులు రెడీ చేశాడట.. అంతేకాదు.. మంచి భోజన ప్రియుడైన ట్రంప్ కు తెలంగాణ వంటకాలైన సర్వపిండి - సకినాలు - నాటుకోడి పకోడిని మంచి నిష్ణాతులైన వంటగాళ్లతో తయారు చేయించాడట.. వీటన్నింటిని వెరైటీగా ప్యాక్ చేయిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వంటకాలకు ఇప్పటికే బ్రాండ్ క్రియేట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ట్రంప్ తో వాటిని రుచిచూపించి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రెడీ అవుతున్నారన్న మాట..