జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా ప్రధానమంత్రి కావాలని ఆశ పడుతున్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. ఇప్పటికే దసరా సందర్భంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ (రాష్ట్ర సమితి)గా మారుస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో వివిధ పార్టీలను విలీనం చేసుకోవడంతోపాటు ఆయా పార్టీల్లో ముఖ్య నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఆయా పార్టీల్లో అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో ఉన్నారు. తద్వారా పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు.
అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సభలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ సభ నిర్వహించవచ్చని సమాచారం.
ఇప్పటికే జాతీయ పార్టీ ఏర్పాటు గురించి ఏపీలో పలువురు నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోకి ఏపీ లోని ముఖ్య నేతలను కేసీఆర్ ఆహ్వానించే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ నిర్వహించే సభ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండొచ్చని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.
మరోవైపు అక్టోబర్ 25న విజయవాడ కేంద్రంగా సీపీఐ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. ఈ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు.
గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తరువాత ఏపీకి వెళ్లినప్పటికీ బహిరంగ సభల్లో ఎక్కడా కేసీఆర్ మాట్లాడలేదు.
సుదీర్ఘ కాలం తరువాత సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆ రోజున ఆయన ఇచ్చే దిశానిర్దేశం ఆధారంగా ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.