కాంగ్రెస్ శతాధిక వృద్ధ పార్టీ. ఆ పార్టీ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఏలింది. అంతే కాదు అనేక రాష్ట్రాలను కూడా తరాల పాటు పాలించింది. అలాంటి కాంగ్రెస్ ప్రాభవం ఈ రోజు తగ్గిపోయింది. ఎటు చూసినా పలుకుబడి పలుచన అయిపోయి అధికారం కూడా కురచగా మారింది. దాంతో కాంగ్రెస్ జాతీయ యవనిక మీద మళ్ళీ రాణించే పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.
దానికోసం జగమెరిగిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటి వారు వచ్చి కాంగ్రెస్ కి సలహాలు ఇవ్వాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఎత్తిగిల్లాలీ అంటే పొత్తులే శరణ్యం అని చెప్ప్పడం ద్వారా కాంగ్రెస్ ని తక్కువ చేశారు అనుకోవాలి. అయితే వర్తమాన రాజకీయాలో అది అనివార్యం కాబట్టి కాంగ్రెస్ హై కమాండ్ పొత్తుల వైపు చూసినా చూడవచ్చు. మరి ఏపీలోని వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని కూడా పీకే సూచించారు.
కానీ అది ఆచరణ సాధ్యమేనా అన్నదే ఇక్కడ చర్చ. దీని మీద వైసీపీ బయటా లోపలా కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక వైసీపీలో తీసుకుంటే ఎవరూ ఇష్టపడడంలేదు. ఇది కేవలం మీడియాలో వచ్చిన వార్త. అయినా దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు అన్నది ఏమీ ఉండదు అంటున్నారు వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్. కాంగ్రెస్ ని ఏపీలో పూర్తిగా భూస్థాపితం చేసిన ఘనత వైసీపీది.
అలాంటిది ఆ పార్టీకి తిరిగి ఊపిరి ఎలా పోస్తామని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ స్థితికి చేరుకుంది అంటే దానికి వైసీపీనే కారణం. జగన్ కాంగ్రెస్ ని సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలిచిన పార్టీ మాది అని కూడా గుడివాడ చెబుతున్నారు.
ప్రశాంత్ కిశోర్ లాంటి వారు సలహాలు మాత్రమే ఇస్తారు, వాటిని అధినాయకత్వం ఆమోదించే పరిస్థితి ఉండకోవచ్చు అని ఆయన అంటున్నారు. ఇక ఇదే విషయం మీద రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే మరో విధంగా రియాక్ట్ అయ్యారు. ఏపీకి న్యాయం చేసే పార్టీలతో పనిచేయడానికి సిద్ధమని ఆయన నర్మగర్భమైన కామెంట్స్ చేశారు.
ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఆయన అంటున్నారు. అంటే కాంగ్రెస్ తో పొత్తును తోసిరాజనడంలేదు. మరి ఇది హైకమాండ్ మనసులో ఉన్న మాటేనా అన్న చర్చ కూడా సాగుతోంది. జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే అపుడు వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీల అవసరం మద్దతుకు పడవచ్చు.
నాడు తులసీదళం గా వైసీపీ ఎటువైపు మొగ్గితే అటు వైపు వారే గెలుస్తారు. అయితే ఏపీకి బీజేపీ పెద్దగా సాయం చేయడంలేదు అన్న భావన అయితే వైసీపీ పెద్దలలో ఉంది అంటున్నారు. అయినా పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. ఇక 2024లో తమ మద్దతే అవసరం అనుకున్న నాడు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నిలబడి సపోర్ట్ అడిగిన నాడు అన్నీ ఆలోచించుకునే వైసీపీ మద్దతు ఇస్తుంది అని అంటున్నారు.
అంటే నాటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, ఏపీలో వైసీపీ ప్రత్యర్ధి చంద్రబాబు ఎటు వైపు ఉంటారో చూసుకుని ఆయనకు ఆపోజిట్ గా ఉన్న కూటమికి కానీ పార్టీకి కానీ వైసీపీ మద్దతు ఉండవచ్చు అన్నది ఒక చర్చగా ఉంది. అంటే కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు ఎన్నికలలో ఉండకపోవచ్చు. ఎన్నికల అనంతరం కేంద్రానికి మద్దతు అంటే అపుడు వైసీపీ ఏపీ ప్రయోజనాలను చూసుకుని ఇచ్చినా ఇవ్వవచ్చు అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ వైసీపీ పొత్తు అన్నది పూర్తిగా గాలి వార్త మాత్రం కాదు అని తేలుతున్న విషయం. చూడాలి మరి రానున్న రోజుల్లో దీని మీద ఎలాంటి వార్తలు బయటకు వస్తాయో.