మహమ్మారి కంట్రోల్ కాకపోవడం.. రోజురోజుకు కేసులు పెరుగుతూ మహమ్మారి ఏపీలో విజృంభిస్తుండడంతో ఇక మళ్లీ లాక్ డౌన్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 500కు పైగా కేసులు ప్రతీరోజు నమోదవుతున్న నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉన్న చోట మళ్లీ లాక్ డౌన్ పెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.
స్వయంగా ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు మహమ్మారి తీవ్రంగా ఉన్న చోట లాన్ డౌన్ విధించేస్తున్నారు. పలు పట్టణాలను మూసివేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 47వార్డుల్లో లాక్ డౌన్ విధించారు. అనధికారికంగానే ఈ నిర్బంధాలను అమలు చేస్తున్నారు.
ఇక ఒంగోలులో ఆదివారం నుంచి 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కు కలెక్టర్ నిర్ణయించారు. చీరాలలో 17 నుంచే లాక్ డౌన్ విధించారు. నిత్యవసరాలను ఇంటింటికి అధికారులే అందజేస్తున్నారు.
అనంతపురం జిల్లలోనూ వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆది వారం నుంచి లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం మాత్రమే సడలింపులు ఇస్తున్నారు.
ఇక ఇతర రాష్ట్రాల వారిని ఖచ్చితంగా అనుమతి ఉంటేనే ఏపీలోని పట్టణాలకు అనుమతిస్తున్నారు. ఈపాస్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టారు. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచే ఎక్కువ పాజిటివ్ కేసులు ఏపీలో నమోదవుతున్నట్టు గుర్తించారు. ఇలా ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తీవ్రత ఉన్న చోట లాక్ డౌన్ పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.