ఏటూరు టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత మాగంటి బాబు ఇంట్లో తీరని శోకం అలుముకుంది. ఇదివరకే ఆయన పెద్ద కొడుకు మృతితో వారి కుటుంబంలో తీరని విషాదం వెంటాడింది. ఆ గాయం మరిచిపోకముందే మరో కుమారుడు సైతం ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది.
మాగంటి రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యంతో మృతిచెందారు. తాగుడు అలవాటును మానేందుకు రవీంద్రనాథ్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్టు ప్రచారం సాగుతోంది. మద్యానికి బానిస అయిన రవీంద్రను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించినట్టుగా సమాచారం.
అయితే రవీంద్రనాత్ ఆస్పత్రి నుంచి తప్పించుకొని హోటల్ లో ఉన్నాడని.. రక్తం కక్కుకొని హోటల్ లో రవీంద్రనాథ్ చనిపోయాడని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
ఇదివరకే మాగంటి బాబు మొదటి కుమారుడు సైతం అప్పట్లో చనిపోయాడు. కొన్ని నెలల క్రితమే మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందారు.. ఆయన కూడా అనారోగ్యానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం సాగింది. మాగంటి ఇద్దరు కుమారులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.