సీఎం ఫ్లెక్సీకి గాజులు

Update: 2016-04-20 05:27 GMT
నిర‌స‌న‌ల ప‌ర్వం శృతి మించుతోంది. అసంతృప్తితో ఉన్న నాయ‌కులు అది కూడా మ‌హిళా నేత‌లు ఏకంగా సీఎం ఫ్లెక్సీకే గాజులు తొడిగారు. ఈ సంఘ‌ట‌న బీజేపీ పాలిత రాష్ట్రమైన‌ మ‌ధ్యప్రదేశ్‌ లో జ‌రిగింది. అయితే ఈ నిర‌స‌న వెనుక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఉండ‌టం వివాదంగా మారింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళా కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి ముందు గాజులతో ఆందోళన వ్యక్తం చేశారు. నిర‌స‌న‌ను పుర‌స్క‌రించుకొని సేకరించిన మూడు లక్షల గాజులను ప్రదర్శనకు ఉంచారు. అంతేకాకుండా సీఎం శివరాజ్ సింగ్ కటౌట్ కు గాజులు తొడిగి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభ ఓఝా - సీనియర్ నేత సురేశ్ పచౌరి - జనరల్ సెక్రటరీ శోభన ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అయితే బీజేపీ శ్రేణులు దీన్ని అడ్డుకున్నాయి. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు మహిళలను అడ్డుకుని, పలువురిని అరెస్టు చేశారు.
Tags:    

Similar News