మోడీకి మమత మంట డోస్ పెరిగింది

Update: 2016-12-02 07:59 GMT
గంటకో విమర్శ.. రోజుకో ఆరోపణ అన్నట్లుగా ఉంది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం చూస్తుంటే. రాష్ట్రంలో కూర్చున్న ఆమె.. తన వైపు యావత్ దృష్టి సారించేలా చేస్తున్నారు. ప్రధాని ప్రకటించిన పెద్దనోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నపశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని తీసుకున్న రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జాతీయ స్థాయిలో నాయకుల్ని ఒక్క చోటకు చేర్చి అధికారపక్షంపై పోరాడేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్ని మోడీ పరివారం సమర్థంగా తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. రోజుకో ఆరోపణతో మంట పుట్టిస్తున్న మమత.. నిన్నటికి నిన్న.. ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వకుండా చేయటం ద్వారా.. ఆమెను హత్య చేయాలన్న కుట్రను పన్నినట్లుగా కేంద్రంపై ఆరోపణలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ నేతలు. ఈ వాదనను అందిపుచ్చుకున్న విపక్షాలు.. అధికారపక్షంపై విరుచుకుపడటంతో గురువారం సభా సమయం మొత్తం ఆ ఇష్యూ మీదనే ఉండిపోయింది.

అయితే..విమాన ల్యాండింగ్ కు అనుమతులు తీసుకునే విషయంలో జరిగిన వైనాన్ని కేంద్రం బదులిచ్చినప్పటికీ.. వాటిని వినేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని మమత పుణ్యమా అని.. ఆ వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. టోల్ ప్లాజాల వద్ద సైన్యాన్ని మొహరించటంపై ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ లోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకోనిపక్షంలో తాను బయటకు వచ్చేది లేదంటూ.. ఒక గదిలో తనను తాను గడియ వేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

గడిచిన 10 గంటలుగా మమత సచివాలయంలోని తన గదిలోనే ఉండిపోవటం గమనార్హం. రాష్ట్రంలోని  అన్ని టోల్ ప్లాజాల వద్ద సైన్యాన్నివెనక్కి పిలిపిస్తే తప్పించి.. తాను బయటకురానని మొండికేసుకున్నమమత వైఖరి ఇప్పుడు కేంద్రానికి పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే.. తాము టోల్ ప్లాజాల వద్ద మొహరించటానికి ముందు.. స్థానిక పోలీస్ స్టేషన్లకు ముందస్తుగా సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. మొత్తానికి తనచేష్టలతో కేంద్రలోని మోడీ పరివారానికి షాకిస్తున్న ఆమె వైఖరి ఇప్పుడు పెద్దచర్చగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News