మండపేటకు మంటెక్కింది...

Update: 2022-02-18 13:30 GMT
మరో వివాదంలో జ‌గ‌న్ ఇరుక్కున్నారు. గోదావ‌రి కేంద్రంగా  రాజుకున్న వివాదం ఇది. ముఖ్యంగా కొత్త జిల్లాల ప్ర‌తిపాద‌ల‌న‌పై ఇప్ప‌టికే ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్న త‌రుణాన తాజాగా మ‌రో వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఓవైపు రోజా త‌న‌త‌ర‌ఫు వాద‌న వినిపిస్తూ

త‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాన్ని తిరుప‌తి కేంద్రంగా ఏర్పాట‌య్యే శ్రీ బాలాజీ జిల్లాలో క‌లిపేయాల‌ని కోరుతుంటే, మ‌రోవైపు హిందూపురం కేంద్రంగా శ్రీ స‌త్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని కోరుతుంటే వీట‌న్నింటితో పాటు మ‌రోవివాదం రాజుకుంది.

తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట వాసులు నిన్న‌టివేళ త‌మ‌ను రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లాలో క‌ల‌పాల‌ని కోరుతూ రోడ్డెక్కారు. వంద‌ల సంఖ్య లో విద్యార్థులు, ఇంకా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు నిర‌స‌న‌లో పాల్గొని తమ ఆకాంక్ష వినిపించారు.

వాస్త‌వానికి అమ‌లాపురంను జిల్లా కేంద్రంగా ఉంచుతూ కోన‌సీమ జిల్లాను ప్ర‌క‌టించారు జ‌గ‌న్. ఇందులో రామ‌చంద్రాపురం, మండ‌పేట,అమ‌లాపురం,రాజోలు,గ‌న్న‌వ‌రం,ముమ్మిడివ‌రం ఉండ‌నున్నాయి.

మొత్తం ఏడు  నియోజ‌క‌వ‌ర్గాలతో ఈ జిల్లా ఏర్పాటుకు నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఇందులో రెండు రెవెన్యూ డివిజ‌న్లు ఉండ‌నున్నాయి.ఒక‌టి అమ‌లాపురం, రామ‌చంద్రాపురం.

కొత్త జిల్లా ప‌రిధిలో మొత్తం 24 మండ‌లాలు ఉండ‌నున్నాయి. 2,615 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో కొత్త జిల్లా ఏర్ప‌డ‌నుంది. 18.73లక్ష‌ల మంది జ‌నాభాతో కోనసీమ జిల్లాగా ఆవిర్భ‌వించ‌నుంది..ఈ ప్రాంతం. కానీ కోన‌సీమ జిల్లా పేరుపై కూడా అభ్యంత‌రాలు ఉన్నాయి.త‌మ జిల్లాకు జీఎంసీ బాల‌యోగి పేరు పెట్టాల‌ని కొంద‌రు, అంబేద్క‌ర్ పేరుపెట్టాల‌ని ఇంకొంద‌రు అంటున్నారు. ఇంకా ఈ వివాదం తేల‌క‌ముందే మండ‌పేట వాసులు రోడ్డెక్కారు.
Tags:    

Similar News