ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అప్పుడప్పడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం మామూలే. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంగా దొరికిపోతుంటారు. కానీ.. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేతికి ఒక ఉద్యోగి దొరికిన వైనం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా అత్యున్నత స్థాయిలోని ప్రజాప్రతినిధులు తనిఖీలకు వచ్చినప్పుడు ఆ హడావుడే వేరుగా ఉంటుంది. కనీసం ఆ విషయాన్ని కూడా గుర్తించని ఒక ఉద్యోగి అడ్డంగా బుక్ అయ్యాడు.
ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. అక్కడొక ఉద్యోగి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తన కంప్యూటర్ లో సినిమా చూస్తూ ఉండిపోయారు. డిప్యూటీ సీఎం తనిఖీకి వచ్చిన వాతావరణాన్ని కూడా గమనించలేకపోయాడు. నేరుగా సదరు ఉద్యోగి వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎం.. అతడి వెనుకకు వచ్చి నిలబడ్డారు. అప్పటికి ఆ ఉద్యోగి గుర్తించలేదు. ఉద్యోగి భుజం తట్టిన నేపథ్యంలో వెనుదిరిగి చూసిన ఉద్యోగికి సాక్ష్యాత్తు డిప్యూటీ సీఎం ఉండటంతో తడారిపోయింది.
ఆఫీసులో బుద్ధిగా పని చేసుకోవాల్సిన వేళ.. కంప్యూటర్ లో సినిమా చూసిన ఉద్యోగికి తలంటిన డిప్యూటీ సీఎం.. అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు చూడటానికి ఆఫీసుకు వచ్చావా? ఆఫీసులో కంప్యూటర్లు సినిమాలు చూసేందుకే పెట్టారనుకున్నావా? సినిమాలు చూడాలనుకుంటే ఇంటికెళ్లి చూస్కో అంటూ తీవ్రంగా విరుచుకుపడిన డిప్యూటీ సీఎం దెబ్బకు సదరు ఉద్యోగి మాట రాకుండా ఉండిపోయాడు. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Full View