త‌ప్పు చేసి.. చినబాబు గాలి తీసిన ఏపీ మంత్రి

Update: 2017-08-17 04:07 GMT
త‌ప్పులు మాన‌వ స‌హ‌జం. అయితే.. కొన్ని త‌ప్పుల తీవ్ర‌త ఎక్కువగా ఉంటుంది. ఒక‌వేళ అనుకోని రీతిలో పొర‌పాటున త‌ప్పు చేస్తే దాన్ని నిజాయితీగా చెప్పేస్తే కాస్త ర‌చ్చ అయినా ఇష్యూ అక్క‌డితో ముగుస్తుంది. సాగ‌దీస్తేనే అస‌లు స‌మ‌స్య‌. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తాజా తీరు సాగ‌తీత య‌వ్వారంగా క‌నిపించి షాక్ తినేలా చేస్తుంది. తాను చేసిన త‌ప్పును త‌న‌కు ప‌రిమితం చేయ‌కుండా  పార్టీ అధినేత క‌మ్ సీఎం చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ ప్ర‌స్తావ‌న తెచ్చి ఆయ‌న గాలి తీసేలా వ్యాఖ్య‌లు చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది.

ఏకంగా చిన‌బాబు ప్ర‌స్తావ‌న‌తో కామెడీ చేసిన వైనంపై ప‌లువురు త‌మ్ముళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్ర‌మైన ఉదంతానికి గుంటూరు వేదికైంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న 108వ జ‌యంతి వేడుక‌లు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధ‌వారం జ‌రిగాయి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గుంటూరు న‌గ‌రంలోనూ ఇదే త‌ర‌హా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు హాజ‌ర‌య్యారు. విలేక‌రుల‌తో మాట్లాడే సంద‌ర్భంగా గౌతు ల‌చ్చ‌న్న జ‌యంతిని కాస్తా మంత్రివ‌ర్యులు వ‌ర్థంతిగా మార్చేశారు. గౌతు ల‌చ్చ‌న్న వ‌ర్థంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌న్న వ్యాఖ్య‌ను చ‌టుక్కున నోరు జారేశారు. దీంతో.. ఆయ‌న ప‌క్క‌నున్న స‌హ‌చ‌రులు అలెర్ట్ అయి.. జ‌యంతిని వ‌ర్థంతిగా అన్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు.

సహ‌జంగా ఇలాంటి ఇష్యూలు ఎదురైన‌ప్పుడు క్ష‌మాప‌ణ‌లు చెప్పి.. మాట్లాడితే స‌రిపోతుంది. కానీ.. ఇక్క‌డే అచ్చెన్న చిత్రంగా స్పందించారు. తాను చేసిన త‌ప్పును క‌వ‌ర్ చేసుకోవ‌టానికి మంత్రి లోకేశ్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. గ‌తంలో లోకేశ్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ జ‌యంతిని వ‌ర్థంతి అంటూ సంబోధించార‌ని.. ఆయ‌న సాహ‌చ‌ర్యంతో తాను అలా అన్నాన‌ని వ్యాఖ్యానించ‌టంతో అక్క‌డున్న వారికి నోట మాట రాలేదు. అచ్చెన్న ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? అంటూ అవాక్క‌య్యారు. అధినేత కుమారుడి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఏకంగా ఒక మంత్రి ఈ త‌ర‌హా వ్యాఖ్య చేయ‌టం ఏమిట‌న్న‌ది ఒక ప్ర‌శ్న తలెత్తింది. అయితే.. ఇష్యూను లైట‌ర్ వీన్ చేయ‌టానికే అలా చేశారే కానీ చిన‌బాబును చిన్న‌బుచ్చాల‌ని కాదంటూ అచ్చెన్న మాట‌ల్ని స‌మ‌ర్థించుకునేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించినా.. అదేమీ అత‌క‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా.. అచ్చెన్న‌.. చిన‌బాబు ప్ర‌స్తావ‌న అలా తీసుకురావ‌డమేంది?
Tags:    

Similar News