ఎప్పుడూ హాట్ కామెంట్లతో రాజకీయాలను వేడెక్కించే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కసారిగా నిర్వేదం ప్రదర్శించారు. తన రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తనను అందరూ మోసం చేసేవారేనని.. తనను అపార్థం చేసుకునేవారేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన జీవితాన్ని ఓల్డ్ ఎవర్‌గ్రీన్ హిట్ ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్‌తో పోల్చుకున్నారు. ``నా జీవితం ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే!!`` అని వ్యాఖ్యానించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు!
మరోవైపు.. రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రల(కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల)పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన స్టైల్‌లో స్పందించారు. పాదయాత్ర లు ఎవరైనా చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీ తర్వాత ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేస్తారన్నారు. ``నన్ను ఇతర సెగ్మెంట్‌ల నేతలు పిలిస్తే.. వారి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా`` అని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నేతృత్వంలో రాజశేఖర్ రెడ్డి నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
చట్ట పరిధిలో ఉద్యమాలు చేయకపోవడం వల్లే నక్సలైట్లు అడవుల్లో ఉండి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. రాజకీయ నాయకులు, నక్సలైట్లు కూడా ప్రజల మంచి కోసమే పోరాడుతున్నారని అన్నారు. రాజకీయ నాయకులు చట్ట పరిధిలో పనిచేస్తున్నారన్నారు. నక్సలైట్లు చట్టం పరిధి దాటి పనిచేయడం వల్ల సమాజానికి దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయన్నారు.
నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని జగ్గారెడ్డి హితవుపలికారు. అయితే.. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే ప్రశ్నకు మాత్రం తర్వాత మీకే తెలుస్తుంది! అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.