సోషల్ మీడియాను రాజకీయ నేతలు ఎంత శక్తివంతంగా వినియోగించుకోవచ్చో చేతల్లో చేసి చూపించారు ప్రధాని నరేంద్రమోడీ. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాను అత్యద్భుతంగా వాడుకని.. దేశ వ్యాప్తంగా మోడీ సానుకూల పవనాలు వీచేలా చేసి వ్యూహాత్మకంగా విజయం సాధించారు. సోషల్ మీడియాను అమితంగా ఇష్టపడే ఆయన.. గత ప్రధానుల కంటే భిన్నంగా.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ లోని ట్వీట్స్ సాయంతో సమాచారం అందించటం చేస్తుంటారు.
ట్విట్టర్ తో తనకు సంబంధించిన విషయాల్ని.. తాను చెప్పాలనుకుంటున్నవి చెప్పే ప్రధాని.. ఎవరైనా ట్వీట్ చేస్తే పట్టించుకోరా? అన్న ప్రశ్న తలెత్తే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. దేశం కాని దేశంలో దురదృష్టవశాత్తు కేసుల్లో ఇరుక్కొని.. జైలు జీవితం అనుభవిస్తున్న నలుగురు కుర్రాళ్లు.. ప్రధాని మోడీకి ట్వీట్ చేసినా పట్టించుకోవటం లేదన్న వాదనను వినిపిస్తున్నారు.
పంజాబ్ కు చెందిన సావిష్ సింగ్.. బీహార్ కు చెందిన రాజేష్ కుమార్.. రాజస్థాన్ కు చెందిన రాం సరూప్.. పశ్చిమ బెంగాల్ కు చెంది జబర్ అలీలు భవిష్యత్తు మీద కోటి ఆశలతో ఒక నౌకలో ఉద్యోగానికి చేరారు. అయితే.. సదరు నౌకలో అక్రమ డీజిల్ రవాణా జరుగుతుందన్న విషయం వారికి తెలీదు. ఎప్పటిలానే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇరాన్ కు చెందిన ఈ నౌక.. 2013 మేలో కువైట్ కు చేరుకునే సమయానికి అక్కడి అధికారులు నౌకను తనిఖీ చేయటం.. అందులోఅక్రమ డీజిల్ వ్యాపారం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించి.. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అప్పటి నుంచి నరకయాతన అనుభవిస్తున్న వారు.. ఇటీవల అతి కష్టమ్మీద.. సావిష్ సింగ్ అనే వ్యక్తి ఫోన్లో ఒక ప్రముఖ మీడియా సంస్థతో ఫోన్లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ బాధల గురించి ప్రధాని మోడీకి ఈమొయిల్.. ట్విట్ చేశామని.. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు. తమను మోడీ సర్కారు మాత్రమే కాపాడగలదని.. ప్రధాని మోడీ తమకు సాయం చేస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రధాని మోడీ ఈ నలుగురి యువకుల విషయంలో ఇప్పటికైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.