నిర‌స‌న భ‌యం లేదు!..ఏపీకి మ‌రోమారు మోదీ!

Update: 2019-02-13 15:19 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ద‌క్షిణాదిపై ప్ర‌త్యేకించి ఏపీకి మ‌రింత‌గా దృష్టి సారించిన‌ట్టే క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే గుంటూరులో నిర్వ‌హించిన త‌న స‌భ సక్సెస్ కావ‌డంతో మోదీలో కొత్త ఉత్సాహం వ‌చ్చిన‌ట్టుగానే తెలుస్తోంది. ఇదే వేడిలో మ‌రోమారు ఏపీ ప‌ర్య‌ట‌న‌కు రావాల‌ని మోదీ దాదాపుగా నిర్ణ‌యించుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు టూర్ కు ముందే విశాఖ‌కు మోదీ వ‌స్తున్నార‌ని ఆ పార్టీ నుంచి ప్ర‌క‌టన వ‌చ్చినా... అది ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మారిన షెడ్యూల్ ప్ర‌కారం... ఈ నెల 16న‌నే మోదీ విశాఖ‌కు రావాల్సి ఉంది. అయితే ఆ ప‌ర్య‌ట‌న‌ను మ‌ళ్లీ వాయిదా వేసేసిన బీజేపీ దానిని ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఈ వాయిదా ప్ర‌కారం అయినా విశాఖకు మోదీ వ‌స్తారా?  రారా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ఈ నెల 27 నాటి మోదీ స‌భ‌కు ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి. మోదీ బ‌హిరంగ స‌భ‌కు వేదిక‌గా ఆంధ్రా వ‌ర్సిటీ గ్రౌండ్‌ను వాడుకుంటామ‌ని బీజేపీ నేత‌లు చేసిన విన‌తిని వ‌ర్సిటీ అధికారులు సున్నితంగానే తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో మోదీ స‌భ‌కు అనుమ‌తించలేమ‌ని వర్సిటీ నుంచి సమాధానం రాగా... బీజేపీ నేత‌లు ప్ర‌త్యామ్నాయ వేదిక‌ల కోసం గాలింపు మొద‌లెట్టార‌ట‌. ఈ య‌త్నాల‌తో పాటు మోదీ స‌భ‌కు అనుమ‌తించాల్సిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా లేఖ రాసే ప‌నిలో ఉన్నార‌ట‌.

అయినా ఈ నెల 16న నిర్వ‌హించాల‌నుకున్న మోదీ స‌భ ఎందుకు వాయిదా ప‌డింద‌న్న విష‌యానికి వ‌స్తే... విశాఖ శార‌దాపీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి త‌న ఆశ్ర‌మంలో మ‌హా కుంభాభిషేకం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 14న యుగియ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొంటున్నార‌ట‌. ఈ కారణంగానే యోగీ వ‌చ్చి వెళ్లే రెండు రోజుల త‌ర్వాత మోదీ టూర్ అంత‌గా బాగుండ‌ద‌న్న భావ‌న‌తోనే 16 నాటి మోదీ టూర్ వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... గుంటూరు టూర్‌లో చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇచ్చిన మోదీ... ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి శుభ‌వార్త చెప్ప‌లేదు. మ‌రి విశాఖ టూర్ లో అయినా ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా? అన్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News