మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం

Update: 2021-04-18 06:30 GMT
బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగిన ఈ నేత.. ఉమ్మడి ఏపీ కి ముందు మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబు, ఎన్టీఆర్ లతో కలిసి రాజకీయ అడుగులు వేశారు.

అయితే ఉమ్మడి ఏపీ విడిపోయాక.. చంద్రబాబు హామీ ఇచ్చిన గవర్నర్ పదవి ఇవ్వకపోవడం.. పట్టించుకోకపోవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చారు. టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు.

అనంతరం బీజేపీలో చేరి ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా సోకింది.

ప్రస్తుతం కరోనాతో హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మోత్కుపల్లి చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి తెలిసి ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Tags:    

Similar News