పవర్ చేతికి ఇచ్చి.. మా బతుకుల్ని ఏమైనా బాగు చేయండి మహా ప్రభో అంటూ మోడీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టినా ఫలితం ఏ మాత్రం లేదన్న పెదవి విరుపులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మోడీ లాంటోడు ప్రధాని కుర్చీలో కూర్చున్నంతనే అవినీతి రాక్షసి పరుగులు తీస్తుందని.. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం దేశానికి తరలి రావటమే కాదు.. తమ బ్యాంకు ఖాతాల్లోకి లక్షలాది రూపాయిలు పడిపోతాయన్న ఆశ చాలామందిలో ఉండేది.
లక్షల రూపాయిలు బ్యాంకుల్లో పడకున్నా.. తమకు భారంగా ఉన్న డీజిల్.. పెట్రోల్.. గ్యాస్ ధరల భారం తగ్గించటం కచ్ఛితమన్న భావన వ్యక్తమైంది. అయితే.. అలాంటిదేమీ లేదన్న విషయం ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చేసింది. కుంభకోణాలు బయటకు రాకున్నా.. వేలాది కోట్ల రూపాయిల్ని బ్యాంకుల దగ్గర నుంచి అప్పుగా తీసుకొని.. గుట్టుచప్పుడు కాకుండా దేశం వదిలిపెట్టి పారిపోతున్న వైనాలు బయటకు వస్తూ.. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.
అభివృద్ధిలో దేశం దూసుకెళుతుందన్న మాటల్లోనూ నిజం లేదన్న భావన సగటు జీవిలో ఇప్పుడు షురూ అయ్యింది. ఇలాంటివేళ.. మోడీ సర్కారు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జనాల సంగతి తర్వాత మొదట ఎంపీల్ని సంతృప్తి పరిచే కార్యక్రమానికి తెర తీశారు. ఇందులో భాగంగా తాజాగా ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఎంపీల అలవెన్సుల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం పుణ్యమా అని నియోజకవర్గాల కార్యాలయాల నిర్వహణ.. ఫర్నీచర్ అలవెన్సులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ నియోజకవర్గ అలవెన్సు నెలకు రూ.45 వేలుగా ఉండేది. అదిప్పుడు రూ.60వేలకు మారనుంది. ఫర్నీచర్ అలవెన్సు సైతం రూ.లక్షకు పెరగనుంది.
ఫర్నీచర్ అలవెన్సును ఒక ఎంపీకి తన ఐదేళ్ల పదవీకాలంలో ఒకసారే ఇస్తారు. తాజా పెంపుతో అలవెన్సులు మొత్తంగా ప్రతిఒక్క ఎంపీకి రూ.2.20లక్షలు అందనున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కేంద్రం మీద అదనంగా పడే భారం అక్షరాల రూ.46 కోట్లు కావటం గమనార్హం. ప్రజల పన్ను డబ్బుతో ఇన్నేసి నిర్ణయాలు తీసుకోవటం చూస్తే.. ప్రజల కంటే నేతల అవసరాలు తీర్చే విషయం మీదనే ఎక్కువ ఫోకస్ అన్న భావన కలగటం ఖాయం.